Telangana : తెలంగాణలో భారీ వర్షాలు.. వేరువేరు ఘటనల్లో పది మంది మృతి!
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు కొన్ని చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. కరెంట్ స్తంభాలు పడిపోయాయి.నిన్న పడిన వర్షానికి వేర్వేరు ఘటనల్లో మొత్తంగా పది మంది మృతి చెందారు.