మరో 24 గంటల్లో అల్పపీడనం.. 4 రోజులు నాన్‌స్టాప్ వానలు!

ఏపీలో మరో 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతారణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. 4 రోజులు విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. 

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

 

Rains: రానున్న 24 గంటల్లో ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతారణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. రేపటికల్లా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో ఉన్న రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో సోమవారానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉండటం వల్ల.. రాష్ట్రవ్యాప్తంగా 4 రోజులు విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. 

ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు..

సోమవారం నుంచి వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో సోమవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

ఇక శ్రీకాకుళం, విజయ నగరం, కాకినాడ, తూర్పుగోదావరి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడ క్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మంగళవారం నుంచి పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు