Rain alert for Telangana And Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్ష సూచనను జారీ చేసింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాతుందని.. దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని, ఐదు రోజుల తర్వాతే పూర్తిగా తగ్గుముఖం పట్టి.. తెలుగు నాట వాతావరణం పొడిగా మారుతుందని పేర్కొంది వాతావరణ శాఖ. మళ్లీ కొంత కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వర్షపు చినుకులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీలో వర్షాలు పడుతున్నాయి.