IMD: జూన్ 5 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు! నైరుతి రుతుపవనాలు జూన్ 5 నుంచి 11 మధ్యలో తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. ఈ ఏడాది రుతుపవనాల గమనం సానుకూలంగా ఉందని అధికారులు వివరించారు. మే నెలాఖరుకే రుతుపవనాలు కేరళను తాకేందుకు రెడీగా ఉన్నాయి. By Bhavana 21 May 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Monsoon for Telangana: నైరుతి రుతుపవనాలు జూన్ 5 నుంచి 11 మధ్యలో తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్నట్లు వాతావరణశాఖాధికారులు (IMD) తెలిపారు. ఈ ఏడాది రుతుపవనాల గమనం సానుకూలంగా ఉందని అధికారులు వివరించారు. మే నెలాఖరుకే రుతుపవనాలు కేరళను తాకేందుకు రెడీగా ఉన్నాయి. కేరళ (Kerala) నుంచి ఏపీలోని రాయలసీమ మీదగా తెలంగాణను (Telangana) చేరుకోవడానికి సుమారు వారం రోజులు వ్యవధి పడుతుందని అధికారులు వివరించారు. అంటే జూన్ 5 నుంచి 8 తేదీల మధ్య రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశాలున్నాయి. గత సంవత్సరం కేరళకే జూన్ 11 న రుతుపవనాలు తాకాయి. ఈ ఏడాది తెలంగాణకే జూన్ 5 కల్లా రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. తెలంగాణకు గతేడాది జూన్ 20కి కానీ రుతుపవనాలు ఎంటర్ అవ్వలేదు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాకతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. Also read: దేశాధ్యక్షుడు చనిపోతే బాణసంచా కాల్చి..స్వీట్లు పంచుకున్న దేశస్థులు! #monsoon #telangana #imd #rain-alert మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి