Rahul Gandhi: నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ
లోక్ సభ ఎన్నికలు సిద్ధమయ్యారు రాహుల్ గాంధీ. ఈరోజు ప్రియాంక గాంధీతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు రాహుల్. లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
లోక్ సభ ఎన్నికలు సిద్ధమయ్యారు రాహుల్ గాంధీ. ఈరోజు ప్రియాంక గాంధీతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు రాహుల్. లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
క్రికెట్లో కెప్టెన్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గెలుస్తారని.. రాజకీయాల్లో బీజేపీ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలని.. వాళ్లు(బీజేపీ) గెలిస్తే రాజ్యాంగాన్ని నాశనం చేస్తారంటూ ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ్ యాత్ర ముగింపు సభ ముంబైలో జరుగుతోంది. ఈ సభకు వివిధ రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, నేతలు హాజరు అయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. రాహుల్ భారత్ న్యాయ్ యాత్ర సభకు ముంబైకి బయలుదేరారు సీఎం రేవంత్. ఈ క్రమంలో సాంకేతిక లోపం వల్ల రేవంత్ ప్రయాణించాల్సిన విమానం నిలిచిపోయింది. గంట నుంచి విమానంలోనే ఉన్నారు రేవంత్.
లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. మొత్తం 39 మందితో ఫస్ట్ లిస్టును విడుదల చేసింది. మొదటి జాబితాలో రాహుల్ గాంధీ పేరు కూడా ఉంది.ఆయన వయనాడ్ నుంచి పోటీ చేయనున్నారు.
ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని కేంద్ర ఎన్నికల సంఘం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూచనలు చేసింది. గతంలో రాహుల్.. ప్రధాని మోదీని ఉద్దేశించి పనౌతి, పిక్ పాకెట్ వంటి వ్యాఖ్యలు చేయడంతోనే ఈసీ ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
మోడీ మళ్లీ ప్రధాని అవుతారని రేవంత్ వ్యాఖ్యలు చెప్తున్నాయని హరీష్ తెలిపారు. రేవంత్ ప్రజలనే కాదు.. రాహుల్ గాంధీని మోసం చేశారని అన్నారు. గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ అని రాహుల్ అంటే గుజరాత్ మోడల్ కావాలని రేవంత్ అంటున్నారని చురకలు అంటించారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పది లక్షల ఉద్యోగాల భర్తీ విషయాన్ని మేనిఫెస్టోలో పెడుతామన్నారు. భారత్ జోడో యాత్రలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
సంపన్నుల కోసమే మోడీ ప్రభుత్వం రైల్వే విధివిధానాలను తయారు చేస్తుందని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. పేదలు అడుగు పెట్టలేని ఉన్నత వర్గం రైలును చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. దోపిడీలు బయటపడుకుండా రైల్వే ప్రత్యేక బడ్జెట్‌కు ముగింపు పలికారని ఆరోపించారు.