Dmart Tips: డీమార్ట్‌లో తక్కువ ధరకే సరుకులు కావాలా.. అయితే ఈ చిన్న టిప్స్ మీరు తప్పకుండా పాటించాల్సిందే!

డీమార్ట్‌లో తక్కువ ధరకే వస్తువులు కావాలంటే నెలకు సరిపడా ఒక్కసారిగా తీసుకోవాలి. అలాగే ఫెస్టివల్ సీజన్‌లో డిస్కౌంట్లు ఉంటాయి. ఈ సమయంలో తీసుకుంటే తక్కువ ధరకు ఎక్కువ వస్తువులు లభిస్తాయి. అలాగే సెలవు రోజు కాకుండా సాధారణ రోజుల్లో తీసుకుంటే డిస్కౌంట్లు ఉంటాయి.

New Update
Dmart

Dmart Photograph: (Dmart)

ఇంట్లో ఏదైనా ఉప్పు, కారం ఇలా నిత్యావసర సరుకులు అయిపోతే చాలు అందరికి ముందుగా గుర్తు వచ్చేది డీమార్ట్. ఈ స్టోర్‌లో అన్ని వస్తువులపై డిస్కౌంట్ ఉంటుంది. ఈ క్రమంలో తక్కువ ధరకే అన్ని వస్తువులు లభిస్తాయి. పిల్లలకు కావాల్సిన వస్తువుల నుంచి పెద్ద వాళ్లకు అవసరం అయ్యే వస్తువులు అన్ని కూడా దొరుకుతాయి. అయితే డీమార్ట్‌లో ఇంకా తక్కువకు మీకు కావాల్సిన వస్తువులు లభ్యం కావాలంటే తప్పకుండా ఈ చిన్న టిప్స్ పాటించాల్సిందే. మరి అవేంటో మీకు తెలియాలంటే ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయాల్సిందే.

ఈ రోజుల్లో కొనుగోలు చేయండి

సాధారణంగా చాలా మందికి ఆదివారం సెలవు ఉంటుంది. ఈ క్రమంలోనే ఆదివారం రోజు డీమార్ట్‌కి వెళ్లి ఇంటికి కావాల్సిన వస్తువులు అన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే సెలవు రోజుల్లో ఎక్కువ మంది డీమార్ట్‌కి వెళ్లడం వల్ల తక్కువ రాయితీ ఇస్తారు. అదే వారంలో వేరే రోజు వెళ్లడం వల్ల ఎక్కువగా రాయితీ ఉంటుంది. దీంతో మీకు తక్కువ డబ్బులకు ఎక్కువ మొత్తంలో వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా బ్రాండెండ్ వస్తువులపై కూడా తగ్గింపు లభిస్తుంది. 

ఒకేసారి నెలకు సరిపడా తీసుకోవాలి

కొందరు సరుకులు అయిపోతుంటే తెచ్చుకుంటారు. మరికొందరు వారం లేదా నెల రోజులకు సరిపడా తెచ్చుకుంటారు. అయితే తక్కువగా కాకుండా నెలకు సరిపడా ఒక్కసారిగా సరుకులు తెచ్చుకోండి. అలాగే సోమవారం నుంచి శుక్రవారం లోగా షాపింగ్ చేయండి. దీనివల్ల మీకు డబ్బు ఆదా అవుతుంది. నెలకు సరిపడా ఒక్కసారిగా తీసుకుంటే మీరు పదే పదే డీమార్ట్‌ లేదా వేరే ఇతర షాప్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. 

ఈ వస్తువులపై డిస్కౌంట్లు

డీమార్ట్‌లో ఎక్కువగా డిటర్జెంట్‌లు, సబ్బులు వంటి వాటి మీద ఎక్కువగా డిస్కౌంట్ ఉంటుంది. దాదాపుగా 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మీకు బెనిఫిట్స్ ఉంటాయి. 

ఫెస్టివల్ సీజన్

డీమార్ట్‌లో ఎప్పటికప్పుడు డిస్కౌంట్లు ఉంటాయి. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్‌లో అయితే భారీ డిస్కౌంట్లు ఉంటాయి. అలాగే సీజన్ల బట్టి కూడా డిస్కౌంట్లు మారుతుంటాయి. ఈ సమయాల్లో మీరు వెళ్లి ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకుంటే మీకు డిస్కౌంట్ లభిస్తుంది. 

ఎక్స్‌పైరీ డేట్

డీమార్ట్‌లో ఎక్స్‌పైరీ డేట్‌కు దగ్గరగా ఉన్న వస్తువులపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఇలాంటి వస్తువులు చూసి ఆ ఎక్స్‌పైరీ డేట్ బట్టి మీరు ఉపయోగించగలరని అనుకుంటే తీసుకోవచ్చు. దీనివల్ల మీకు డబ్బులు ఆదా అవుతాయి. అయితే ఈ తేదీ పూర్తి అయిన వస్తువులు వాడకూడదు. దీన్ని బట్టి మీరు వస్తువులు తీసుకోవాలి. 

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఏవైనా సందేహాలు ఉంటే వీటికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.

Advertisment
తాజా కథనాలు