ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు పోలీసులు మృతి!
రాజస్థాన్ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సభకు భద్రత కోసం వెళ్తున్న పోలీసు వాహనం ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి చెందగా ..ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
రాజస్థాన్ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సభకు భద్రత కోసం వెళ్తున్న పోలీసు వాహనం ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి చెందగా ..ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
కర్ణాటకలో 545 ఎస్సై పోస్టుల భర్తీకి గతంలో నిర్వహించిన రాతపరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో అక్కడి హైకోర్టు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని తీర్పునిచ్చింది. ఈ మేరకు కొందరు అభ్యర్థులు కర్ణాటక సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టివేసింది.
ఏలూరు జిల్లా చింతలపూడిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నకిలీ ధ్రువపత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
నిన్న విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు స్థానిక టీడీపీ నేతలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికిన విషయం తెలిసిందే. అయితే.. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారన్న కారణంతో పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
సూర్యాపేట జిల్లాలో రెండు అనుమానస్పద హత్య కేసులు కలకలం రేపాయి. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించగా.. మరో మహిళ తన భర్తను హత్య చేయించి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే వీళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు చివరికి ఈ రెండు కేసులను విజయవంతంగా చేధించారు.
అమెరికాలోని లెవిస్టన్ పట్టణంలో ఇటీవల కాల్పులు జరిపిన నిందితుడు రాబర్ట్ కార్డ్ మృతి చెందాడు. ఓ రీసైక్లింగ్ సెంటర్ దగ్గర్లోని చెట్ల పొదల్లో ఒకరి మృత దేహాన్ని స్థానికులు గుర్తించగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని రాబర్డ్ కార్డ్‌గా గుర్తించారు. బుల్లెట్ గాయంతో అతడు మృతి చెందాడని తెలిపారు. అయితే రాబర్ట్ కార్డ్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైనా కాల్చి చంపారా? అన్న విషయాన్ని పోలీసులు ఇంకా తేల్చలేదు.
చైనాకు అనుకూలంగా వార్తలు రాస్తోందని, వారికి నిధులు అందాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూస్ క్లిక్ పోర్టల్ పై ఢిల్లీ పోలీసులు మరో కొత్త కేసు నమోదు చేశారు. న్యూస్ క్లిక్ ఆన్ లైన్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థాను ఢిల్లీ పోలీసుల అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
నడి రోడ్డు మీద ఓ పోలీసు అధికారిని(police officer) మహిళ (women) చెప్పుతో కొట్టింది. దీంతో రెచ్చిపోయిన పోలీసు ఆమెను కాలితో తన్నాడు. ఈ విషయం అంతా అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో(social media) పెట్టడంతో వైరల్(virul) గా మారింది.