మూడోసారీ మనమే...మనల్ని ఎవడ్రా ఆపేది...!!
దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమే. భారత ఆర్థిక వ్యవస్థ కూడా ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంటుందని వ్యాఖ్యనించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నూతన అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (IECC) కాంప్లెక్స్‌ను ఆయన దేశానికి అంకితం చేశారు. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు భారత్ మండపం అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ... ప్రతి భారతీయుడు భారత్ మండపాన్ని చూసి సంతోషంగా, గర్వపడుతున్నారని అన్నారు.