Rahul Gandhi : మోదీ(Modi) ఇంటిపేరు కేసులో తాను ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణలు చెప్పబోనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి స్పష్టం చేశారు. ఈ కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించారు. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని దుర్వినియోగం చేసి..ఎలాంటి తప్పు చేయకపోయినా..తనను క్షమాపణ చెప్పాలని కోరడం న్యాయ ప్రక్రియను అపహస్యం చేసినట్లే అవుతుందని రాహుల్ గాంధీ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ అఫిడవిట్లో రాహుల్ గాంధీ… మోదీ ఇంటి పేరు కేసులో(Modi Surname Case) తాను నిర్దోషినని ఎప్పుడో స్పష్టం చేశానని, ఈ నేరానికి క్షమాపణ చెప్పవలసి వస్తే, తాను ఇప్పటికే చెప్పేవాడినని అన్నారు. క్షమాపణలు చెప్పడానికి నిరాకరించినందుకే రాహుల్ గాంధీ ‘అహంకారి’ అని దుర్భాషలాడుతున్నారంటూ తనపై కేసు పెట్టిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..నేను నిర్దోషిని…ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు..!!
మోదీ ఇంటిపేరు...వ్యాఖ్యల కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును అభ్యర్ధించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేలా వీలు కల్పించాలంటూ రాహుల్ గాంధీ కోరారు. ఈ వివాదస్పద వ్యాఖ్యల విషయంలో తాను ఏ విధంగానూ క్షమాపణలు చెప్పబోనని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో తెలిపారు.
Translate this News: