Independence Day 2023 : నేటి నుంచి " మేరీ మాటి మేరా దేశ్" కార్యక్రమం ప్రారంభం...!!

జూలై 30న 'మన్ కీ బాత్' 103వ ఎడిషన్ సందర్భంగా 'మేరీ మాటి మేరా దేశ్' ప్రచారానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఈ క్యాంపెయిన్‌లో దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించి అమరవీరులను స్మరించుకోనున్నారు. ఆగస్టు 9న ప్రచారాన్ని ప్రారంభించి, ఆగస్టు 30న ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ప్రతినెలా చివరి ఆదివారం మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఆల్ ఇండియాలో రేడియోలో దేశ ప్రజలతో ముచ్చటించే సంగతి తెలిసిందే.

author-image
By Bhoomi
New Update
Independence Day 2023 : నేటి నుంచి " మేరీ మాటి మేరా దేశ్" కార్యక్రమం ప్రారంభం...!!
Meri Mati Mera Desh :

ఆగస్టు 15న దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవం (77th Independence Day) ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘మేరీ మాటి మేరా దేశ్‌’ ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ వారం 103వ ఎపిసోడ్ లో ప్రధాని మోదీ (PM Modi) ఈ విషయాన్ని వెల్లడించారు. మేరీ మాటి మేరా దేశ్ పేరుతో కొత్త ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. దేశరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను గౌరవించుకునేందుకు ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా అమరవీరుల గౌరవార్థం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

'మేరీ మాటి మేరా దేశ్' ప్రచారం అంటే ఏమిటి?
జూలై 30న 'మన్ కీ బాత్' (Mann Ki Baat) 103వ ఎడిషన్ సందర్భంగా 'మేరీ మాటి మేరా దేశ్' (Meri Mati Mera Desh) ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ క్యాంపెయిన్‌లో దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించి వీరులను స్మరించుకోనున్నారు. వారి జ్ఞాపకార్థం, అమృత్ సరోవర్స్ సమీపంలోని గ్రామ పంచాయతీలలో శిలాఫలకాలను (స్మారక ఫలకాలు) ఏర్పాటు చేస్తారు. అమృత్ మహోత్సవ్ ప్రతిధ్వనుల మధ్య, ఆగస్టు 15 సమీపిస్తున్న కొద్దీ దేశంలో మరో గొప్ప ప్రచారం ప్రారంభం కాబోతోందని ప్రధాన మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. అమృత్ కలశ యాత్ర పేరుతో దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 7500 కలశాల్లో మట్టి, మొక్కలను సేకరించి ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్థూపం పక్కనే అమృత్ వాటిక పేరుతో స్థూపాన్ని నిర్మించనున్నట్లు మోదీ తెలిపారు.

ప్రచార లక్ష్యం ఏమిటి?
దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్య్ర సమరయోధులు, అమర వీరులను సన్మానించడం ఈ ప్రచారం లక్ష్యం. దేశవ్యాప్తంగా గత ఏడాది నిర్వహించిన హర్‌ఘర్‌ తిరంగా క్యాంపెయిన్‌ అత్యంత విజయవంతమైందని, ఈ ఏడాది ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కింద 'మేరీ మాటి మేరా దేశ్‌' అనే మరో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సమాచార, ప్రసారాలు, టెలికాం శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. వీరులకు నివాళిగా ఫలకం ఏర్పాటు చేయడం, మట్టికి నమస్కరించడం.. మేరీ మాటి మేరా దేశ్ ప్రచారంలో కీలక భాగమని తెలిపారు. ఈ ఏడాది కూడా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం...మేరి మాటి మేర దేశ్‌లో ముఖ్యమైన భాగంగా జరుపుకుంటామని ఆయన అన్నారు. ఆగస్టు 9 నుంచి 30వ తేదీ వరకు గ్రామ, బ్లాక్ స్థాయి, స్థానిక పట్టణ సంస్థలతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో 'మేరి మాటి మేరా దేశ్' ప్రచారంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రజలు మట్టి లేదా మట్టి దీపాలను పట్టుకుని తమ సెల్ఫీలను అప్‌లోడ్ చేయడానికి https://merimaatimaredesh.gov.in/ వెబ్‌సైట్ ప్రారంభించినట్లు సాంస్కృతిక కార్యదర్శి తెలిపారు. ఈ ప్రచారంలో యువత ఉత్సాహంగా పాల్గొనాలని, మన మాతృభూమి వీరులకు నివాళులు అర్పించే దేశ వ్యాప్త కృషిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

Also Read: ఇక భారత్ జోడో యాత్ర రెండో దశ.. ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే…!

Advertisment
తాజా కథనాలు