Pakistan Missiles Attack On India | భారత్ వైపు దూసుకొస్తున్న రాకెట్లు | India VS Pakistan War | RTV
మంగళగిరిలో జనసేన పార్టీ నిర్వహించిన పహల్గాం అమరులకు నివాళి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో కలిసి అమరులకు నివాళులర్పించారు.
పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ నివాళులు అర్పించారు. ‘‘ ఈ దుర్ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు స్మితా సబర్వాల్ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో వారి దుఃఖంలో నేను పాలుపంచుకుంటున్నాను’ అని పోస్ట్ చేశారు.
పహల్గాం దాడి చేసింది తామేనని TRF ప్రకటించింది. కానీ దీనివెనక లష్కర్ ఈ తోయిబా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఖలీద్ అనే మారుపేరుతో తిరుగుతున్న సైఫుల్లా ఈ దాడికి కుట్రపన్నినట్లు సమాచారం. 2023లో TRFను భారత్ 'ఉగ్రవాద సంస్థ'గా పేర్కొంటూ నిషేధం విధించింది.
పహల్గాం ఘటన పర్యాటకులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. టూరిస్టులు ప్రాణభయంతో ఆ ప్రాంతాన్ని వదిలి పరుగులు తీస్తున్నారు. గడిచిన 6గంటల్లో దాదాపు 4వేల మంది తిరుగు పయణమయ్యారు. ప్రత్యేక విమానాలతోపాటు అన్నిఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.