Pahalgam Attack: భయం గుప్పిల్లో కశ్మీర్ పర్యాటకులు.. 6గంటల్లో ఎన్నివేల మంది వెళ్లిపోయారంటే!

పహల్గాం ఘటన పర్యాటకులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. టూరిస్టులు ప్రాణభయంతో ఆ ప్రాంతాన్ని వదిలి పరుగులు తీస్తున్నారు. గడిచిన 6గంటల్లో దాదాపు 4వేల మంది తిరుగు పయణమయ్యారు. ప్రత్యేక విమానాలతోపాటు అన్నిఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. 

New Update
jammu

jammu Photograph: (jammu )

Pahalgam Attack: జమ్మూకశ్మీర్‌  పహల్గాం ఘటన పర్యాటకులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. టెర్రర్ అటాక్‌తో వణికిపోతున్న జమ్మూకశ్మీర్ టూరిస్టులు ప్రాణభయంతో ఆ ప్రాంతాన్ని వదిలి పరుగులు తీస్తున్నారు. వేల సంఖ్యలో తిరిగి ఇళ్లకు పయణమవుతుండగా కేవలం 6 గంటల్లోనే దాదాపు 4వేల మంది శ్రీనగర్‌ నుంచి వెళ్లిపోయినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.  బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు నుంచి 20 విమానాలు వెళ్లినట్లు వెల్లడించారు.

 

వాటర్, ఫుడ్ అందిస్తున్నాం..

ఈ మేరకు మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. ‘ఉగ్రదాడి జరిగిన వెంటనే శ్రీనగర్‌ నుంచి పర్యటకులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. రద్దీ నెలకొనడంతో ప్రత్యేక ఏర్పాట్లు కల్పించాం. వాటర్, ఫుడ్ అందిస్తున్నాం. ఇప్పటివరకు 20 విమానాలు వెళ్లగా దాదాపు 4వేల మంది పర్యటకులు ఇక్కడినుంచి పయణమయ్యారు. మరిన్ని విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. టికెట్ ధరలు పెంచకూడదని  విమానయాన సంస్థలకు సూచించాం. ఎయిర్‌లైన్లు టికెట్‌ క్యాన్సిలేషన్‌, రీషెడ్యూల్‌ ఛార్జీలను క్యాన్సిల్ చేశాయి. మనమంతా పర్యటకులకు అండగా నిలబడాలి’ అని సూచించారు. పర్యాటకులు కశ్మీర్‌ లోయను వీడుతుంటే మనసు చలించిపోతుందని జమ్మూకశ్మీర్‌ సీఎం ఓమర్ అబ్దుల్లా అన్నారు. పర్యటకుల తిరుగు ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, విమానాలతో పాటు రోడ్డు మార్గంలోనూ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. 

ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్..

ఢిల్లీ మాజీ పోలీసు చీఫ్, CRPF జమ్మూ కశ్మీర్ జోన్ మాజీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ SN శ్రీవాస్తవ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. 'ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాద సంస్థలపై ప్రధాన చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ దాడితో కశ్మీర్‌లో తమ ఉనికిని కొనసాగించాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. కశ్మీరీలకు పర్యాటకమే ప్రధాన జీవనాధారం. ఇలాంటి దాడులు పర్యాటకాన్ని నాశనం చేయడం కోసమే. ఇదొక కుట్రలో భాగమే. భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నా' అన్నారు.

: jammu kashmir attack | pehalgam terror attack | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు