Pahalgam Attack: టిఆర్‌ఎఫ్ ముసుగులో లష్కర్ ఈ తోయిబా దాడులు.. ఆన్‌లైన్‌లో యువకుల రిక్రూట్‌మెంట్!

పహల్గాం దాడి చేసింది తామేనని TRF ప్రకటించింది. కానీ దీనివెనక లష్కర్ ఈ తోయిబా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఖలీద్ అనే మారుపేరుతో తిరుగుతున్న సైఫుల్లా ఈ దాడికి కుట్రపన్నినట్లు సమాచారం. 2023లో TRFను భారత్ 'ఉగ్రవాద సంస్థ'గా పేర్కొంటూ నిషేధం విధించింది.  

New Update

Pahalgam Attack: పహల్గాం బైసరన్‌లో దాడికి పాల్పడింది 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)'గా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాద సంస్థ లష్కర్ ఈ తోయిబాతో కలిసి పనిచేస్తున్న టీఆర్ఎఫ్ 2019నుంచి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. కశ్మీర్ యువతను ఆకర్షించి, వారికి ఇండియాపై వ్యతిరేక పెంచి ఉగ్రవాద సంస్థలో చేర్చుకుంటున్నట్లు పేర్కొంది. జనవరి 2023లో  చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద TRF ను 'ఉగ్రవాద సంస్థ'గా పేర్కొంటూ భారత హోం శాఖ అధికారిక ప్రకటన విడుదలచేసింది.  

జర్నలిస్టులకు టిఆర్‌ఎఫ్ బెదిరింపులు..

ఈ మేరకు అప్పటినుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించింది. ఉగ్రవాదుల నియామకం, ఉగ్రవాదుల చొరబాటు, పాకిస్తాన్ నుంచి జమ్మూకశ్మీర్‌లోకి ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకోసం ఈ సంస్థ పనిచేస్తోందని తెలిపింది. కశ్మీర్‌లోని జర్నలిస్టులను టిఆర్‌ఎఫ్ బెదిరింపులకు గురిచేసిన వెంటనే కేంద్ర హోంశాఖ ఈ సంస్థను నిషేధించింది.  అయితే పహల్గాం దాడికి పాల్పడింది తామేనని టీఆర్ఎఫ్​ చెప్పినప్పటికీ దీని వెనుక లష్కర్ ఈ తోయిబా ఉన్నట్లు పోలీసులు అధికారులు బలంగా వాదిస్తున్నారు. 

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

లష్కార్ ఈ తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి ఈ దాడికి వ్యూహ రచన చేసినట్టు సమాచారం. పాకిస్తాన్ కు చెందిన సైఫుల్లా కసూరి.. లష్కర్ ఈ తోయిబా సంస్థలో కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడు. ఖలీద్ అనే మారుపేరుతో తిరుగుతున్న సైఫుల్లా ఈ దాడికి కుట్రపన్నినట్లు అనుమానిస్తున్నారు. సైఫుల్లా కసూరి ఎల్ఇటీ గ్రూప్ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సారధ్యంలో పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థకు గ్రౌండ్‌ వర్కర్స్‌ సహాయ సహకారాలు అందిస్తున్నారని, స్థానిక ప్రజల సహకారంతోనూ దాడులు చేయగలుగుతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

pehalgam terror attack | terrorist | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు