Paytm and Zomato Deal: పేటీఎం మూవీ టికెట్స్ సర్వీస్ జొమాటో చేతిలోకి..
ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో.. వినోద రంగంలోకి అడుగుపెట్టబోతోంది. ఇందుకోసం పేటీఎం మూవీ టికెటింగ్ సర్వీస్, ఈవెంట్ బిజినెస్ ను కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ వాల్యూ 1500 కోట్ల రూపాయలని చెబుతున్నారు. చాలాకాలంగా జొమాటో ఈ రంగంలోకి ప్రవేశించాలని చూస్తోంది.