హైదరాబాద్‌లో ఈసీ బృందం.. అసెంబ్లీ ఎన్నికల చర్చ

తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షిస్తుంది. హైదరాబాద్‌లో 3 రోజుల పాటు ఈసీ బృందం సమీక్ష జరుపుతోంది. దీనిలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులతో సమావేశమై సన్నాహకాల గురించి.. ఎన్​ఫోర్స్​మెంట్​ ఏజెన్సీలతోనూ, బ్యాంకర్లతోనూ సమావేశమై చర్చించింది.

New Update
హైదరాబాద్‌లో ఈసీ బృందం.. అసెంబ్లీ ఎన్నికల చర్చ
EC team in Hyderabad.. Assembly election discussion
కీలక భేటీ

అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై హైదరాబాద్ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘం బృందం కసరత్తు కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఈసీ ప్రతినిధి బృందం వరుసగా రెండో రోజు సమావేశమైంది. జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక, సన్నద్దతను సమీక్షించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోం, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు జితేందర్, నవీన్ మిత్తల్, సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

ఎన్నికల ప్రణాళికలపై చర్చ

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రణాళిక, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం, ఉద్యోగుల బదిలీలు, పోస్టింగులు, రిటర్నింగ్ అధికారుల నియామకం, భద్రత, బలగాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, డబ్బు సహా ప్రలోభాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం వసతి, సీఈవో కార్యాలయంలో అధికారులు, సిబ్బంది నియామకం సహా ఇతర అంశాలు కూడా చర్చకు రానున్నాయి.

ఎన్నికలకు రంగం సిద్ధం

వచ్చే ఏడాది జనవరిలోగా ఎన్నికలు పూర్తి చేసి.. ప్రభుత్వం ఏర్పడేటట్లు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా 3 రోజుల పాటు హైదరాబాద్​ వేదికగా చర్చలు జరుపుతోంది. ఈ నెల 22వ హైదరాబాద్​ చేరుకున్న సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలోని ఈసీ అధికారుల బృందం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ వికాస్​రాజ్​తో చర్చలు జరిపారు. ఓటర్ల జాబితా తయారీ, ఈవీఎంలు సిద్ధం చేయడం, అధికారులకు ఎలా శిక్షణ ఇవ్వాలనే అంశాలపై దృష్టి సారించారు.

అక్రమ నగదు రవాణాపై దృష్టి

ఈ క్రమంలో ఆగస్టు రెండో తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటించి అందులో ఏవైనా అభ్యంతరాలు, వినతులు ఉంటే తీసుకుని.. అక్టోబర్​లో తుదిజాబితాను ప్రకటించనున్నారు. ఈవీఎంల తనిఖీలతో పాటు అధికారులకు శిక్షణ ప్రక్రియ జరుగుతోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​ రాజ్​.. పోలీస్​ నోడల్​ అధికారి, కేంద్ర సాయుధ బలగాల నోడల్​ అధికారితో ఈసీ సమావేశం అయింది. ఎన్నికల్లో నిర్వహించాల్సిన భద్రత అంశాలు.. బ్యాంకర్ల సమితి, వాణిజ్య పన్నుల శాఖ, కేంద్ర బలగాలు, జీఎస్టీ, ఆదాయపన్ను శాఖలతో సమావేశమయ్యారు. ఇంకా ఎన్నికల వేళ జరిగే అక్రమాలు, అక్రమ నగదు రవాణా వంటి వాటిపై దృష్టి పెట్టింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు