ఫిల్మ్‌నగర్‌లో విషాదం.. ఆత్తింటి వేధింపులతో తల్లీబిడ్డ బలి

హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత, తన కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విషాద ఘటన జూబ్లిహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌లో జరిగింది.

New Update
ఫిల్మ్‌నగర్‌లో విషాదం.. ఆత్తింటి వేధింపులతో తల్లీబిడ్డ బలి

Filmnagar lo Mother and child sacrificed due to in-law harassment

కుటుంబ కలహాలతో 

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత, తన కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విషాద ఘటన ఫిల్మ్‌నగర్‌లో జరిగింది. ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటోన్న విశ్వనాథ్, శిరీష దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు మూడేళ్ల బాలుడు మనీస్ ఉన్నాడు. ఏం జరిగిందో తెలియదు శనివారం రాత్రి శిరీష, తన కొడుకు మనీష్‌ ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కి ఉరి వేసుకుని విగతజీవులుగా కనిపించారు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

భర్య, అత్తమామలే కారణం..

పెళ్లైన నాటి నుంచి శిరీషను అత్తింటి వారు నానాకష్టాలు పెట్టేవారు. బాలుడు మనీష్‌ పుట్టాక వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. ఇప్పుడు శిరీష మళ్లీ మూడు నెలల గర్భిణి అని తెలిసి అత్తింటి వేధింపులు జాస్తి అయ్యాయి. అటు పుట్టింటికి చెప్పుకోలేక ఇటు అత్తింటి వేధింపులు భరించలేక చివరకు ఆత్మహత్య శరణ్యమని భావించింది. ఈ క్రమంలో రాత్రి గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. శిరీష గదిలోనుంచి ఎంతకు బయటకు రాకపోవడంతో భర్త విశ్వనాథ్ గదిలోకి వెళ్లి చూడగా కుమారుడు మనీష్‌తోపాటు భార్య శిరీష ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. పరుగున వెళ్లి తల్లిదండ్రులకు ఈవిషయం చెప్పాడు విశ్వనాథ్‌. అనంతరం శిరీష కుటుంబానికి సమాచారం అందించారు. శిరీష మృతదేహాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. తమ కూతురు, మనవడు మృతికి ఆమె అత్తింటి వారే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిరీషది నిజంగా ఆత్మహత్యా? లేదా భర్య, అత్తమామలు చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు