కేపీ చౌదరి కేసుకు నాకు ఎలాంటి సబంధం లేదు: ఆషూరెడ్డి

అనవసరంగా ఈ విషయంలోకి నన్ను లాగుతున్నారని ఆషూ రెడ్డి సీరియస్‌ అయ్యారు. కేపీ చౌదరి కేసులో తన నాపేరు ఎందుకు వస్తుందని గట్టిగా ప్రశ్నించారు. నాకు ఎవరితో ఎలాంటి సంబంధాలు లేవు.. సమయం వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తుల గురించి అంతా చెబుతానని.. తనపై ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో ఆర్థం కావట్లేదంటూ ఆషూరెడ్డి ఫైర్ అయ్యారు.

New Update
కేపీ చౌదరి కేసుకు నాకు ఎలాంటి సబంధం లేదు: ఆషూరెడ్డి

i-have-nothing-to-do-with-the-kp-chaudhary-case

నాపై తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నా..

కబాలి నిర్మాత కేపీ చౌదరి మాదకద్రవ్యాల కేసులో తన పేరు వెలుగులోకి రావడంపై బిగ్ బాస్ ఫేమ్, నటి ఆషూ రెడ్డి తాజాగా స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆమె సోషల్ మీడియా వేదికగా ఖండించారు.

సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతా

తనకు మాదకద్రవ్యాలకు సంబంధించి ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవని, తనపై వచ్చిన వార్తలన్నీ తప్పని స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తుల గురించి అన్ని విషయాలు చెబుతానని అన్నారు. అనుమతి లేకుండా తన ఫోన్ నెంబర్ ప్రచురిస్తే అస్సలు ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలు తనపై ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బిగ్‌బాస్‌ నటిలకు ఫోన్‌ కాల్స్

కేపీ చౌదరి, బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న ఓ నటితోనూ వందల సంఖ్యలో ఫోన్‌ కాల్స్ చేసినట్టు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెరపైకి ఆషూ రెడ్డి పేరు రావడం సంచలనంగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు