మువ్వా విజయ్ బాబు బాధ్యతల స్వీకరణ
తెలంగాణ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా మువ్వా విజయ్ బాబు ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మువ్వ విజయ్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా మువ్వా విజయ్ బాబు ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మువ్వ విజయ్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూర్ణిమ ఉత్సవంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వేణు దత్తాత్రేయ స్వామికి అభిషేకం, పాదుకపూజ నిర్వహించారు.
అనారోగ్యానికి గురై హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ తెలంగాణ ప్రజా కవి జయరాజును మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జయరాజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ధవళేశ్వరం బ్యారేజీ మొదటి గేటు దగ్గర బోటు ఇరుక్కుంది. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో లంగరు వేసిన ఇసుక బోటు కొట్టుకు వచ్చింది. గేట్ల మధ్య ఇరుక్కుపోయిన బోటును బయటకు లాగేందుకు ఇరిగేషన్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో Realme Narzo 70x 5G స్మార్ట్ ఫోన్ పై రూ.5 వేలకు పైగా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.17,999 కాగా.. వివిధ ఆఫర్లతో రూ.12 వేలలోపే సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ ఈ రోజు మిడ్ నైట్ తో ముగియనుంది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 కు సంబంధించిన తొలి అప్డేట్ వచ్చింది. ఈ సీజన్ లోగోను ప్రోమో రూపంలో రిలీజ్ చేశారు. నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా కనిపించనున్నారు. స్వయంగా ఆయనే తన ట్విటర్ లో పోస్ట్ పెట్టారు. 'ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధం కండి' అని పేర్కొన్నారు.
జగన్ ఈ 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయని అంటున్నాడని.. ఆయన చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని హోంమంత్రి అనిత డిమాండ్ చేశారు. నిరూపించకపోతే జగన్ పై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తే కేసులు పెట్టేందుకు వెనకాడమన్నారు.
బోనాల సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ రోజు దర్శించుకున్నారు. బతుకమ్మ, ఉగాది ఏ పండుగైన సామూహికంగా, మనిషి జీవన విధానాన్ని ఉట్టిపడే పద్ధతిలో పండుగలు జరుపుకునే గొప్ప సాంప్రదాయం ఉన్న ప్రాంతం తెలంగాణ అని అన్నారు.
పెద్దవాగు ప్రాజెక్టు తెగిపోవడంతో విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో దమ్మపేట మండలం గుమ్మడివల్లి, నందిపాడు, కోయరంగాపురం, 29 గిరిజన ఆవాస గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో 2 రోజులుగా టీజీఎన్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.