Warangal News: హనుమకొండలో హైటెన్షన్.. అసలేమైందంటే?

హనుమకొండలో డబుల్ బెడ్రూం ఇళ్ల తాళాలు పగులగొట్టి అందులో ఉంటున్న పేదలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తాము గుడిసెల్లో ఉండలేకపోతున్నామని పేదలు ఆందోళనకు దిగారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

New Update
Warangal News: హనుమకొండలో హైటెన్షన్.. అసలేమైందంటే?

ఓ వైపు భారీ వర్షాలకు నిలువ నీడ లేక తాము అవస్థలు పడుతుంటే.. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పంచకుండా తాళాలు వేసి ఉంచడంపై పేదలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళాలను పగలగొట్టి ఆ డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వెళ్లారు. అయితే.. సంచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఈ ఘటన హనుమకొండ బాలసముద్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. స్థానికంగా అనేక మంది పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: Minister Thummala: అధికారుల నిర్లక్ష్యంతోనే పెద్దవాగు ఘటన.. మంత్రి తుమ్మల సంచలన కామెంట్స్

అయితే.. గత రెండు, మూడు రోజులుగా వర్షాలు విస్తృతంగా కురుస్తుండడంతో అందులో ఉండలేని పరిస్థితి నెలకుంది. లోపలికి నీళ్లు రావడంతో పాటు గుడిసెలు కురుస్తుండడంతో అందులో ఉండలేని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కోట్లు ఖర్చు చేసి స్థానికంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పంచకుండా అలాగే ఉంచడంపై వారు మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో వారు డబుల్‌ బెడ్రూం ఇళ్ల తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి తలదాచుకున్నారు. మూడు రోజులుగా వర్షాలకు గుడిసెల్లో ఉండలేని పరిస్థితి నెలకొందని వారు చెబుతున్నారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు బలవంతంగా డబుల్‌ బెడ్రూం ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని డబుల్‌ బెడ్రూం ఇళ్ల ముందు లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇది కూడా చదవండి: Weather Alert : భారీ వర్షాలు.. పెరుగుతున్న గోదావరి నీటిమట్టం



Advertisment
Advertisment
తాజా కథనాలు