గాండీవధారి అర్జున ప్రీ-టీజర్, హాలీవుడ్ రేంజ్లో అదిరిపోయే విజువల్స్
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న మూవీ గాండీవధారి అర్జున. స్టైలీష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం నుండి తాజాగా మేకర్స్ ప్రీ టీజర్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ లెవల్ యాక్షన్ సీన్స్ తో వచ్చిన ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ టీజర్ కాస్త యూట్యూబ్‌లో దుమ్ములేపుతోంది.
ఏలూరు జిల్లా పులిరాముడుగూడెంలో దారుణం
ఏలూరు జిల్లాలో అత్యంత దారుణ ఘటన జరిగింది. గిరిజన సంక్షేమ వసతిగృహంలో ఉండి చదువుకుంటున్న నాలుగో తరగతి గిరిజన విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు అత్యంత దారుణంగా చంపేశారు. జిల్లాలోని బుట్టాయగూడెం మండలం పులిరాముడుగూడెంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది.
తన మానసిక ఆరోగ్య పరిస్ధితిపై అమీర్‌ఖాన్ కుమార్తె ఇరాఖాన్ ఎమోషనల్
అమీర్ ఖాన్ కుమార్తె ఇరాఖాన్ 2021లో అగస్తు అనే మానసిక ఆరోగ్య అవగాహన ఫౌండేషన్‌ని ప్రారంభించారు. నిరంతరం వెలుగులో ఉండే కుటుంబంలో పెరగడం తన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసిందని ఇరాఖాన్ పేర్కొంది. ఇది కొన్ని సమయాల్లో సహాయకంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్బాల్లో మాత్రం ప్రతికూల పరిస్ధితులను ఎదుర్కొన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్త నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు దళపతి విజయ్‌కి జరిమానా?
చెన్నైలో తన పార్టీ సభ్యులను కలుసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా తన కారును అనుసరిస్తున్న అభిమానులను తప్పించుకోవడానికి తలపతి విజయ్ రెడ్ సిగ్నల్స్ క్రాస్ చేయాల్సి వచ్చింది. దీంతో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు విజయ్ కారుకి ట్రాఫిక్ పోలీసులు రూ. 500 జరిమానా విధించినట్లు సమాచారం. అంతేకాదు దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పానీపూరిపై గూగుల్ స్పెషల్ డూడుల్ ...అది చూస్తే నోరు ఊరుతుంది..!!
మనలో చాలా మందికి పానీపూరి అంటే చాలా ఇష్టం. సాయంకాలం అయ్యిందంటే చాలు పానీపూరీ బండ్ల దగ్గర క్యూ కడుతుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూప పానీపూరీని ఇష్టపడుతుంటారు. అందుకే పానీపూరికి గూగుల్ ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చింది. దక్షిణభారత్ లో గోల్ గొప్పా అని పిలుచుకునే పానీపూరీ డూడుల్ ను తయారు చేసింది. భారత్ లో అత్యధిక ప్రజలు ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ పానీపూరి అంటూ గుగూల్ చెప్పుకొచ్చింది.
ఉచిత విద్యుత్‌పై రాహుల్-రేవంత్‌ను ప్రశ్నించిన కవిత
తెలంగాణలో ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఈ విషయమై ఢిల్లీ ఆగ్రనేత రాహుల్‌గాంధీపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.
పోలీస్‌స్టేషన్ సాక్షిగా ప్రేమజంటపై తల్లిదండ్రుల దాడి
పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గద్వాలకు చెందిన ప్రశాంత్, మండలంలోని పూడూరుకు చెందిన శిరీష ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి ఇళ్లలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే తమ తల్లిదండ్రుల నుంచి రక్షణ కోరుతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా యువతి కుటుంబీకులు పోలీస్ స్టేషన్లోనే వారిపై దాడికి పాల్పడ్డారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/national-news-mp-brij-bhushan-stalked-molested-liable-to-be-punished-delhi-police-chargesheet2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/The-threat-of-thieves-in-Bodan.even-the-tomatoes-in-the-fridge-cant-be-left.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/cinema-tollywood-gandeevadhari-arjuna-movie-pre-teaser-released-hollywood-range.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Atrocity-in-Puliramudugudem-of-Eluru-district.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/movies-bollywood-hero-aamir-khan-daughter-ira-khan-reveals-how-being-a-star-kid-affected-her-mental-health.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/entertainment-south-hero-thalapathy-vijay-fined-for-violating-traffic-rules-rs-500.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/pani-puri-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/A-poem-questioning-Rahul-Revanth-on-free-electricity.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/news-telangana-love-marriage-attack-couples-ps-runs-sp-office-jogulamba-gadwal-district.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Bitter-experience-for-volunteers-in-Guntur-district.jpg)