గుంటూరు జిల్లాలో వాలంటీర్లకు చేదు అనుభవం

గుంటూరు నగరంలో వాలంటీర్లకు చేదు అనుభవం ఎదురైంది. రింగురోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన వాలంటీర్లు ఆధార్‌ డేటా బేస్ ఆధారంగా సమాచారం సేకరణకు ప్రయత్నించారు. దీంతో అపార్ట్‌మెంట్‌ వాసులు వారిని ప్రశ్నించారు.

New Update
గుంటూరు జిల్లాలో వాలంటీర్లకు చేదు అనుభవం

Bitter experience for volunteers in Guntur district

వాలంటీర్లను నిర్బంధం

గుంటూరు నగరంలో వాలంటీర్లకు చేదు అనుభవం ఎదురైంది. రింగురోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన వాలంటీర్లు ఆధార్‌ డేటా బేస్ ఆధారంగా సమాచారం సేకరణకు ప్రయత్నించారు. దీంతో అపార్ట్‌మెంట్‌ వాసులు వారిని ప్రశ్నించారు. గతంలో వచ్చి ఆధార్‌ వివరాలు తీసుకెళ్లారు.. మళ్లీ ఎందుకు వచ్చారంటూ వారిని నిలదీశారు. దాదాపు గంటకుపైగా వాలంటీర్లను నిర్బంధించారు. సమాచారం అందుకున్న నగరపాలక సంస్థ అధికారులు అక్కడికి చేరుకొని అపార్ట్‌మెంట్‌ వాసులతో మాట్లాడారు. అధికారులు విజ్ఞప్తి చేయడంతో వారిని వదిలేశారు.

వాలంటీర్ వ్యవస్థ టార్గెట్

ఈ మధ్య వారాహి విజయయాత్రలో పవన్‌ కళ్యాణ్‌ వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాలంటీర్ల గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం అని ఏపీ మంత్రులు స్పందిస్తూనే ఉన్నారు. పవన్ రాజకీయ నేత కాదని, కేవలం సెలబ్రిటీ అని అన్నారు. ఒక దశ, దిశ లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఏపీ నేతలు అంటున్నారు.పవన్‌కు ఒక విధానం అంటూ లేదని, అన్నీ గాలివాటం మాటలేనని మంత్రి బొత్స కూడా విమర్శించారు.

క్షమాపణలు చెప్పాలని వాలంటీర్ల డిమాండ్

వాలంటీర్ల దగ్గర ఇంటి గుట్టు మొత్తం ఉంటుంది. వ్యక్తిగత డేటా బహిర్గతం అవుతుంది. ఆడబిడ్డ రహస్యాలు బహిర్గతం చేశారని వాలంటీర్లపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల గురించి, వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారం రేపాయి. పవన్ చేసిన ఆరోపణలు రాష్ట్రంలో అగ్గి రాజేశాయి. పవన్‌పై వైసీపీ నాయకులు, వాలంటీర్లు విరుచుకుడుతున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని, క్షమాపణలు చెప్పాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మహిళా కమిషన్ నోటీసులు కూడా ఇచ్చింది. ఇంత జరిగినా పవన్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. మరోసారి ఆయన వాలంటీర్ వ్యవస్థ గురించి హాట్ కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు