ఉచిత విద్యుత్‌పై రాహుల్‌-రేవంత్‌ను ప్రశ్నించిన కవిత

తెలంగాణలో ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఈ విషయమై ఢిల్లీ ఆగ్రనేత రాహుల్‌గాంధీపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.

New Update
ఉచిత విద్యుత్‌పై రాహుల్‌-రేవంత్‌ను ప్రశ్నించిన కవిత

టీకాంగ్రెస్‌పై ట్విట్టర్ వేదికగా విమర్శలు

అయితే తెలంగాణలో రైతులకు 3 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తానా సభల్లో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్‌ రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఈ విషయమై పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. పోటీగా కాంగ్రెస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను నిర్వహించారు. ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తుందని టీకాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ తరుణంలో టీకాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ ట్వీట్‌ను రాహుల్ గాంధీకి కవిత ట్యాగ్ చేశారు .

స్టేట్‌మెంట్ చూసి తాను షాక్‌

కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను ఇవ్వలేకపోతున్నందున తెలంగాణ రైతులను కూడ ఇబ్బందికి గురి చేయాలనుకుంటున్నారా అని మాజీ ఎంపీ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను బీఆర్ఎస్ కాపాడుతుందని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు ప్రతి రైతుకు తాము అండగా నిలబడుతామని కవిత తేల్చి చెప్పారు. రైతులకు మూడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని రేవంత్ ఇచ్చిన స్టేట్‌మెంట్ చూసి తాను షాక్‌కు గురైనట్టుగా కవిత చెప్పారు. రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో ఏ రాజకీయ పార్టీకైనా ఇబ్బంది ఎలా ఉంటుందని కవిత ప్రశ్నించారు.

A poem questioning Rahul-Revanth on free electricity

పోటాపోటీగా నిరసనలు

తానా సమావేశాలకు హాజరైన రేవంత్‌రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ 3 గంటలు ఇస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. అయితే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరిస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ నిన్న, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఉచిత విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ నేతల తీరుపై కాంగ్రెస్ కూడా పోటీ నిరసనలకు నేడు దిగింది.

A poem questioning Rahul-Revanth on free electricity

దిష్టి బొమ్మ దహనం

రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ రేవంత్‌రెడ్డి ప్రకటనపై మండిపడ్డ మండల బీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్‌గౌడ్. అమెరికా తానా సభల్లో బయటపడ్డ కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి.. తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన్నారు. రైతులకు కేవలం3 గంటలు విద్యుత్ ఉచిత ఇస్తే చాలనడం రైతుల పట్ల వాళ్ళ నీచ సంస్కృతికి నిదర్శనం అని స్పష్టమవుతుందన్నారు. గతంలో విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది... రేవంత్‌రెడ్డి పీసీసీ అయిన నాటి నుండే రైతులపై విషం కక్కుతున్నారని దీనికి కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో రైతుల చేతుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు అన్నారు. సందర్భంగా జగదేవపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల మరియు గ్రామ బీఆర్ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు