గాండీవధారి అర్జున ప్రీ టీజర్ లో ఒక్కో సీన్స్ అండ్ ఒక్కో షాట్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఆ సీన్స్ కు తగ్గట్టుగా మిక్కీ జే మేయర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదే రేంజ్లో ఉంది. ఇక త్వరలో దీనికి సంబంధించిన ఫుల్ టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను ఎస్వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. గని సినిమాతో వరుణ్, ఘోస్ట్ సినిమాతో ప్రవీణ్ సత్తారు. ఫ్లాప్ చిత్రాలు చేసి నిరుత్సాహంగా ఉన్నారు. ఈ ఇద్దరికీ ఈ సినిమా చాలా స్పెషల్ అనే చెప్పాలి. అందుకే ఈ సినిమాపై వీరిద్దరు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఈ ఇద్దరికీ ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో చూడాలి.
పూర్తిగా చదవండి..గాండీవధారి అర్జున ప్రీ-టీజర్, హాలీవుడ్ రేంజ్లో అదిరిపోయే విజువల్స్
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న మూవీ గాండీవధారి అర్జున. స్టైలీష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం నుండి తాజాగా మేకర్స్ ప్రీ టీజర్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ లెవల్ యాక్షన్ సీన్స్ తో వచ్చిన ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ టీజర్ కాస్త యూట్యూబ్‌లో దుమ్ములేపుతోంది.
Translate this News: