BREAKING: ఖాతా తెరిచిన బీజేపీ
నిర్మల్ లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గెలిచారు.
దుబ్బాకలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓటమి పాలయ్యారు.ఆయనపై బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు.
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాతా తెరిచింది. ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య గెలిచాడు. 38 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే అశ్వరావుపేట కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ గెలిచారు. రామగుండంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి విజయ శంఖారావం పూరించారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం భారీ తుపానుగా మారింది. దీంతో రానున్న 24 గంటల్లో నెల్లూరు - కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని, 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
లవంగం మనం రోజు తినే ఆహారంలో ఒక స్పైస్ లా వాడతాము. ఇది మంచి ఫ్లేవర్ తో పాటు వీటిలో క్యాల్షియం, ప్రోటీన్, పొటాషియం, సోడియం, ఐరన్ పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, చర్మ సౌందర్యం, మగవారిలో స్పెర్మ్ కౌంట్ ను మెరుగుపరచడంలో సహాయపడును.
డెస్టినేషన్ వెడ్డింగ్ క్రేజ్ పెరుగుతోంది. దేశీయంగానే కాదు.. విదేశాల్లోనూ పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలా డెస్టినేషన్ వెడ్డింగ్స్ బయట దేశాల్లో జరగడం వాళ్ళ కోట్లాదిరూపాయలు ఖర్చు అవుతోంది. ఈ మేరకు మన దేశంలో మన వ్యాపార, ఆర్ధిక వ్యవస్థకు ప్రయోజనం ఉంటుంది.
ఎన్నికల సమరం ముగిసింది. ఫలితాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈలోపు ఎగ్జిట్ పోల్స్ హడావుడి మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ అనే విధానం మొదట అమెరికాలో 1967లో తీసుకువచ్చారు. మన దేశంలో 1996నుంచి ఎగ్జిట్ పోల్స్ ను అధికారికంగా మీడియాలో ప్రసారం చేస్తూ వస్తున్నారు.
అన్నమయ్య జిల్లాలో ఓ మహిళ తన కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్కు వెళ్తే ఓ హెడ్ కానిస్టేబుల్ ఆమెను కామవాంఛ తీర్చాలని అడగడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోని తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తోంది.
ఇటీవల బెయిల్ నుంచి విడుదలైన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం ఆయన కృష్ణా జిల్లా గన్నవరానికి రానున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు గన్నవరం వద్ద చంద్రబాబును స్వాగతించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు.