త్వరలో నాకు మంత్రి పదవి | Neelam Madhu Mudiraj | RTV
TG: కేసీఆర్, హరీష్ రావు నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పించేందుకు వచ్చానని అన్నారు సీఎం రేవంత్. ఈ సారి కాంగ్రెస్ గెలవకపోతే మెదక్ జిల్లాలో శాశ్వత బానిసత్వం వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పోటీ చేయకుండా పోలీసుల చేత కేసులు పెట్టించే పరిస్థితి వస్తుందని అన్నారు.
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న నీలం మధు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. జిల్లా ముఖ్య నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. ఈ రోజు జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిశారు. తన గెలుపు సహకరించాలని కోరారు. జగ్గారెడ్డిని కూడా త్వరలో కలవనున్నారు.
బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిన పఠాన్ చేరు నేత నీలం మధు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా దీపాదాస్ మున్షీ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. నీలం మధుకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీసీ యువనేత నీలం మధు బీఎస్పీకి రాజీనామ చేశారు. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గుర్తించి పార్టీ టిక్కెట్ కేటాయించినందుకు బీఎస్పీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సినిమా యాక్టర్లను వచ్చినా...పవన్ కల్యాణ్ ను తీసుకొచ్చినా..నార్త్ లీడర్లను తీసుకువచ్చినా...తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే అన్నారు పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులంతా బచ్చాగాళ్లు...గాళ్లతో నాకేం పోటీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
తనను మోసం చేసిన బీజేపీ, కాంగ్రెస్ పై ప్రతీకారం తీర్చుకుంటానని నీలం మధు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
పటాన్ చెరు కాంగ్రెస్ అభ్యర్థి మార్పు ఖాయమన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అభ్యర్థిగా ప్రకటించిన నీలం మధుకు ఇంత వరకు బీఫామ్ ఇవ్వకపోవడంతో ఏదైనా జరగవచ్చని గాంధీభవన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బీ ఫామ్ నాదే...పటాన్ చెరు గడ్డమీద గెలుపు నాదే అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు. సీఎం కేసీఆర్ కు తన దమ్ము ఏంటో తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచినా, ఓడినా తాను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని తెలిపారు.