Telangana cabinet : బీసీలకు సీఎం రేవంత్‌ గుడ్‌ న్యూస్‌.. పొన్నం, నీలం మధులకు కీలక పదవులు!

బీసీల కేంద్రంగా తాజా రాజకీయాలు నడుస్తోన్న నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యారని ఇందులో డిప్యూటీ సీఎం పదవిని పొన్నంకు దక్కే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

New Update
revanth and ponnam

revanth and ponnam

తెలంగాణలో బీసీల కేంద్రంగా తాజా రాజకీయాలు నడుస్తోన్న నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఒక డిప్యూటీ సీఎం పదవి ఉంటుందని మరోకరికి మంత్రి పదవి ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇక ఎస్టీ, మైనార్టీ, రెడ్డి, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరిని కేబినెట్ లోకి ఎంపిక చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

బీసీ నేతకు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలనే భావిస్తోన్న సీఎం రేవంత్ ఆ పదవిని పొన్నం ప్రభాకర్‌కు కట్టబట్టే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.  గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్‌ ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకు ఆ శాఖతో పాటుగా  డిప్యూటీ సీఎం బాధ్యతలను కూడా కల్పించనున్నారని తెలుస్తోంది. ఇక బీసీకి సామాజిక వర్గం, ముదిరాజ్‌ కమ్యూనిటీకి చెందిన నీలం మధుకు కూడా మంత్రి పదవి దక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్ కేబినేట్ లో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్న సంగతి తెలిసిందే.  

ఆరు మంత్రి పదవులు ఖాళీ

ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఎస్టీ, మైనార్టీ, వెలమ, రెడ్డి సామాజికవర్గాలకు ఛాన్స్‌ దక్కనుంది.  ఎస్టీ నుంచి బాలునాయక్‌, రాంచంద్రునాయక్‌ లలో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్‌ ఉండగా..  మైనార్టీల నుంచి అమీర్‌ అలీఖాన్‌కు మంత్రి పదవి పక్కా అనే టాక్ నడుస్తోంది.  వెలమ సామాజికం నుంచి మదన్‌మోహన్‌రావు, రెడ్డి కమ్యూనిటీ నుంచి సుదర్శన్‌రెడ్డి పేర్లు ఖరారు అయినట్లుగా టాక్ నడుస్తోంది.  ఇప్పటికే వీరి పేర్లను ఖరారు చేసి కాంగ్రెస్‌ హైకమాండ్‌ కు లిస్ట్ పంపినట్లుగా సమాచారం. ఇవ్వాళ లేదా రేపు కొత్తమంత్రుల పేర్లు ప్రకటించే ఛాన్స్‌ ఉంది.  

Also Read :  అయోధ్య రామాలయానికి పునాది వేసిన కామేశ్వర్ చౌపాల్ కన్నుమూత!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు