RGV : ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్
ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్ పడింది. సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు.. మరోసారి సినిమాను రివ్యూ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లోగా నివేదికను సబ్మిట్ చేయాలని సూచించింది.
ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్ పడింది. సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు.. మరోసారి సినిమాను రివ్యూ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లోగా నివేదికను సబ్మిట్ చేయాలని సూచించింది.
విశాఖలో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ పై టీడీపీ నేత లోకేష్ ఘాటుగా స్పందించారు. సీఎం ఇంటిపక్కనే యువతిపై గ్యాంగ్ రేప్ జరిగితే నేటివరకూ నిందితుడ్ని పట్టుకోలేదు అని ఫైర్ అయ్యరు. రాక్షస పాలనలో రక్షణలేదు అంటూ మండిపడ్డారు.
తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ములు చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ రాశారు. అగ్రిగోల్డ్ బాధితులు యువగళం పాదయాత్రలో తనను కలిసి గోడు వెళ్లబోసుకున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది రాజకీయ మరింత వేడెక్కుతోంది. బీసీల ఓట్లే లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ పావులు కదుపుతోంది. జనవరి 4వ తేదీ నుంచి 'జయహో బీసీ' కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, తొలి విడతలో క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు పర్యటిస్తారని నారా లోకేష్ ప్రకటించారు.
టీడీపీ నేత నారా లోకేష్ అరెస్ట్‌కు సీఐడీ పక్కా ప్లాన్‌తో ముందడుగు వేస్తున్నట్లు తెఉలస్తోంది. రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించిన సీఐడీ.. కోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసింది. మరి లోకేష్ స్పందన ఎలా ఉంటుందో? అని ఉత్కంఠ నెలకొంది.
నారా లోకేష్ కు ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది. రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నాడని అధికారులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు సూచనలతో లోకేష్ కు పోలీసులు వాట్సాప్ లో నోటీసులు పంపించారు. నోటీసు అందుకున్నట్లు వాట్సాప్ లో సీఐడీ కి సమాధానం ఇచ్చారు లోకేష్.
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. టీడీపీ నేత నారా లోకేష్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ గ్రీటింగ్స్ పంపించారు. లోకేష్ థాంక్స్ చెబుతూ రిప్లై ఇచ్చారు.
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి షాక్ తగిలింది. మంగళగిరి నియోజవర్గానికి చెందిన వైసీపీ కీలక నేతలు నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.
గన్నవరం ఎయిర్‌పోర్టులో లోకేశ్‌తో పాటు ప్రశాంత్ కిశోర్ కనిపించారు. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న పీకే లోకేశ్‌తో కనిపించడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం టీడీపీ ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ ఉన్నారు. ఇక పీకేకి టీడీపీ గెలుపు బాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది.