Andhra Pradesh: టీడీపీ బీసీ మంత్రం.. జనవరి 4 నుంచి 'జయహో బీసీ'..

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది రాజకీయ మరింత వేడెక్కుతోంది. బీసీల ఓట్లే లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ పావులు కదుపుతోంది. జనవరి 4వ తేదీ నుంచి 'జయహో బీసీ' కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, తొలి విడతలో క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు పర్యటిస్తారని నారా లోకేష్ ప్రకటించారు.

New Update
Andhra Pradesh: టీడీపీ బీసీ మంత్రం.. జనవరి 4 నుంచి 'జయహో బీసీ'..

Andhra Pradesh Elections: ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని, మరోసారి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న తెలుగుదేశం పార్టీ.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా బీసీల ఓట్లపై దృష్టి సారించింది. ఈసారి బీసీలు తమ పార్టీలను ఆదరిస్తారని ఆశతో ఉన్న టీడీపీ(TDP).. వారిని తమవైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే నెల అంటే జనవరి 4వ తేదీన 'జయహో బీసీ(Jayaho BC)' కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 4వ తేదీ నుంచి జయహో బీసీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. బీసీలు బలహీనులు కాదు - బలవంతులన్న నినాదంతో ముందుకెళ్తామన్నారు. వైసీపీ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయాలపై అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు లోకేష్. రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత బీసీలపై దాడులు పెరిగాయని, కేసులతో బీసీలపై దౌర్జ్యం చెలాయిస్తున్నారని ఆరోపించారు లోకేష్. అంతేకాదు.. సీఎం జగన్ బీసీల ద్రోహి అంటూ ఓ రేంజ్‌లో కామెంట్స్ చేశారు.

బీసీల కోసం ప్రత్యేక చట్టం..

ఇటీవల యువగళం ముగింపు సభలో నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లుగా.. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని చెప్పారు లోకేష్. ఇందులో భాగంగానే జయహో బీసీ కార్యక్రమం చేపడుతున్నామని, రెండు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని లోకేష్ చెప్పారు. తొలి విడతలో క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు పర్యటిస్తారని, బీసీలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలన్నీ ఆ పర్యటనలో తమ నాయకులు తెలుసుకుంటారన్నారు. తర్వాత నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభలో చంద్రబాబునాయుడు బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తారని లోకేశ్‌ తెలిపారు.

రిజర్వేషన్ తగ్గించి..

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో 10శాతం రిజర్వేషన్‌ తగ్గించిందని లోకేశ్‌ ఆరోపించారు. బీసీల అసైన్డ్‌ భూమి 8 వేల ఎకరాలను కూడా వెనక్కి తీసుకుందన్నారు. పనిముట్లు అందించే ఆదరణ పథకాన్ని రద్దు చేసిందని విమర్శించారు. జీవో నం. 217తో మత్స్యకారులకు వైసీపీ అన్యాయం చేసిందని, పట్టు రైతులకు సబ్సిడీ కూడా రాష్ట్రప్రభుత్వం ఇవ్వలేకపోతోందని వ్యాఖ్యానించారు. బీసీల తరఫున టీడీపీ నాయకులు పోరాడుతుంటే, వారిపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తంచేశారు. యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర, అచ్చెనాయుడుపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. టీడీపీ నాయకులపై హత్యాకాండ జరుగుతోందని, పొద్దుటూరులో తమ నాయకుడు నందం సుబ్బయ్యను హత్య చేశారని ఆరోపించారు. మరోచోట ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు దుకాణం ధ్వంసం చేశారని విమర్శించారు. వైసీపీని ఓడిస్తే బీసీలకు మంచిరోజులు వస్తాయన్నారు.

Also Read:

టార్గెట్ మేఘా కృష్ణా రెడ్డి.. కాళేశ్వరంలో అవినీతిపై మంత్రుల సంచలన కామెంట్స్!

అభయహస్తం అప్లికేషన్‌పై అనేక సందేహాలు.. సమాధానం ఏది?!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు