TDP Lokesh : విశాఖలో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ పై(Visakha Gang Rape) టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్(Lokesh) స్పందించారు. సీఎం జగన్ పై(CM JAGAN) నిప్పులు చెరిగారు. సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శలు దాడికి దిగారు. ఆంధ్ర ప్రదేశ్ లో రాక్షస పాలన మొదలైంది అని అన్నారు. పాపాల పాలకులు ప్రశాంతమైన విశాఖ పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. విశాఖలో(Visakha) బాలికపై గ్యాంగ్ రేప్ రాష్ట్రంలో భయానక పరిస్థితులకు అద్దం పడుతోందని అన్నారు. సీఎం ఇంటిపక్కనే యువతిపై గ్యాంగ్ రేప్ జరిగితే నేటివరకూ నిందితుడ్ని పట్టుకోలేదు అని ఫైర్ అయ్యరు.
ALSO READ : BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కేసు నమోదు
నారా లోకేష్ ట్విట్టర్(X) లో.. ' పాపాల పాలకులు ప్రశాంతమైన విశాఖ పాలిట శాపంగా మారారు. రాజధాని చేస్తామని విశాఖ నగరాన్ని నేరాలు-ఘోరాలకి అడ్డా చేశారు. విశాఖలో బాలికపై గ్యాంగ్ రేప్ రాష్ట్రంలో భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది. సీఎం ఇంటిపక్కనే యువతిపై గ్యాంగ్ రేప్ జరిగితే నేటివరకూ నిందితుడ్ని పట్టుకోలేదు. టిడిపి పాలనలో ఆర్థికరాజధానిగా విశాఖని ప్రమోట్ చేశాం. వైకాపా విశాఖని అఘాయిత్యాలకి కేపిటల్ చేసింది. రాక్షస పాలనలో రక్షణలేని బాలికలు, మహిళలకు మీ కుటుంబసభ్యుడిగా నాదో వినతి. మూడు నెలల పాటు జాగ్రత్తగా ఉండండి. నేరగాళ్ల రాజ్యం అంతం అవుతుంది, ప్రజాప్రభుత్వం వస్తుంది, మీ రక్షణ బాధ్యత తీసుకుంటుంది.' అంటూ రాసుకొచ్చారు.
పాపాల పాలకులు ప్రశాంతమైన విశాఖ పాలిట శాపంగా మారారు. రాజధాని చేస్తామని విశాఖ నగరాన్ని నేరాలు-ఘోరాలకి అడ్డా చేశారు. విశాఖలో బాలికపై గ్యాంగ్ రేప్ రాష్ట్రంలో భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది. సీఎం ఇంటిపక్కనే యువతిపై గ్యాంగ్ రేప్ జరిగితే నేటివరకూ నిందితుడ్ని ప…
— Lokesh Nara (@naralokesh) January 2, 2024
ALSO READ: కాళేశ్వరం అవినీతిపై ఏం చేస్తున్నారు? అవినీతిని కక్కించాల్సిందే అంటున్న కిషన్ రెడ్డి.!