గుండెపోటుతో మాజీ ఎంపీ కన్నుమూత
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆదివారం తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. ట్రీట్మెంట్ కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. చికిత్స తీసుకుంటూ ఆయన ఆదివారం (ఈరోజు) సాయంత్రం కన్నుమూశారు.