SLBC Tunnel Accident : SLBC టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్.. రంగంలోకి హైడ్రా రంగనాథ్!

అచ్చంపేట మండలం దోమలపెంట  వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రక్షించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రెస్క్యూ ఆఫరేషన్‌ ఈ రోజు కీలక మలుపు తిరిగింది.

New Update
slbc

SLBC Tunnel

SLBC Tunnel Accident  : అచ్చంపేట మండలం దోమలపెంట  వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్‌బీసీ  టన్నెల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రక్షించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ రెస్క్యూ ఆఫరేషన్‌ ఈ రోజు కీలక మలుపు తిరిగింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి హైడ్రా బృందాలు  సహాయక చర్యల్లో భాగమవుతుండగా ఈ రోజు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ రంగలోకి దిగారు. కార్మికులను కాపాడేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

Also Read: హైక్లాస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్!

కాగా రంగానాథ్‌ మంత్రులు ఉత్తమ్‌, జూపల్లి, ఉన్నతాధికారులు, రెస్య్కూ టీమ్స్‌తో చర్చించారు. ఈ సందర్భంగా అన్ని టీమ్స్‌ను అనుసంధానం చేసుకుంటూ వీలైనంత త్వరగా రెస్క్యూ ఆఫరేషన్‌ పూర్తి చేస్తామని రంగానాథ్‌ తెలిపారు. ఇప్పటికే వారం రోజులుగా కార్మికులను రక్షించేందుకు రెస్క్ఊ కొనసాగుతుండగా మరింత త్వరగా రెస్క్యూను పూర్తి చేయాలని ఆధికారులు భావిస్తున్నారు. కాగా ఆఫరేషన్‌ కోసం తాజాగా సీపీఆర్‌ టెక్నాలజీ, అల్ట్రా థర్మల్‌ కటర్స్‌ ను వినియోగిస్తున్నారు. దీంతో ఏ క్షణమైనా కార్మికుల ఆచూకీ దొరికే ఛాన్స్‌ ఉందన్న వార్తలు వినవస్తున్నాయి.

Also Read: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!

ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఆదేశాలతో హైడ్రా రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి. సంఘటనా స్థలంలో ఇతర అధికారులతో కలిసి కమిషనర్ రంగనాథ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు దోమలకుంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు.  సహాయక చర్యలను పర్యవేక్షించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు. కార్మికులను కాపాడేందుకు టన్నెల్‌లో సహాయక చర్యలు శనివారం నుంచీ కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి వెల్లడించారు. రెస్క్యూ టీమ్‌లు రాత్రి నుంచి అక్కడే పని చేస్తున్నాయని చెప్పారు. సొరంగం లోపలికి ఆక్సిజన్ పంపుతున్నామని, వాటర్ తోడేసే పనులు నిరంతరం సాగుతున్నాయని మంత్రి వెల్లడించారు.  

Also read : పింక్ బుక్‌లో వాళ్లు పేర్లు.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

Also read: SLBC: మంత్రుల చేపల కూర విందు.. కేటీఆర్ సంచలన ట్వీట్!

Advertisment
తాజా కథనాలు