Naga Babu: అంజనా దేవి ఆరోగ్యంపై నాగబాబు కీలక ప్రకటన!

చిరంజీవి తల్లి అంజనా దేవికి అనారోగ్యం అంటూ వస్తున్న వార్తలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. అమ్మ ఆరోగ్యం చాలా బాగుందని స్పష్టం చేశారు. కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారని తెలిపారు. 

New Update
naga babu clarity on mother Anjana devi health

naga babu clarity on mother Anjana devi health

Naga Babu: చిరంజీవి తల్లి అంజనా దేవి ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో.. మెగా బ్రదర్ నాగ బాబు దీనిపై స్పందించారు. ప్రస్తుతం అమ్మ ఆరోగ్యంగా ఉందని స్పష్టం చేశారు. కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని.. ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. దీంతో అంజనా దేవికి అస్వస్థత అంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది. అలాగే మెగా అభిమానులు, చిరంజీవి శ్రేయాభిలాషులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే గతంలో కూడా అంజనా దేవి ఆరోగ్యం గురించి ఇలాంటి వార్తే వైరల్ అయ్యింది. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. అమ్మ ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి ప్రచారం జరగడం చర్చనీయాంశంగా మారింది. 

Also Read: నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!

అసలేం జరిగింది?

అంజనాదేవి తీవ్ర అస్వస్థతకు గురవడంతో  ఉదయం ఆమెను  కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆస్పత్రికి తీసుకెళ్లారని వార్తలు వచ్చాయి. అంతేకాదు  ఈ విషయం తెలియడంతో కేబినెట్ సమావేశం నుంచి పవన్, షూటింగ్ నుంచి చిరంజీవి బయలుదేరి వచ్చినట్లు ప్రచారం జరిగింది.  ఇప్పుడు నాగబాబు పోస్టుతో ఈ వార్తలన్నీ అసత్యాలని తేలిపోయింది. 

Also Read: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)

Advertisment
Advertisment
తాజా కథనాలు