ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో జనసేన తరఫున మంత్రిగా నాగబాబు బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే మొన్నటి వరకు రాజ్యసభ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఏపీ కేబినెట్‌లోకి నాగబాబు పేరు ఖరారు అయినట్లు రాజకీయ వర్గాల సమాచారం. మరోవైపు రాజ్య సభకు టీడీపీ అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయి. బీద మస్తాన్ రావు, సానా సతీష్ పేర్లను టీడీపీ ఖరారు చేసింది. అలాగే ఇప్పటికే ఆర్. కృష్ణయ్య పేరును బీజేపీ ఖరారు చేసింది.
Also Read: ఉదయించే సూర్యుడికి శత్రువుగా ఉంది రెండాకుల గుర్తే..!
ఎన్నికల ముందు కీలక పాత్ర పోషించిన నాగబాబు
ఇదిలా ఉంటే నిజానికి నాగబాబు జనసేనలో ఎన్నికల ముందు నుంచి అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జనసేన శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ముఖ్యంగా పిఠాపురం నియోజక వర్గంలో సోదరుడు పవన్ కళ్యాణ్ ప్రచార బాధ్యతలను తాన భుజాలపై వేసుకున్నారు.
Also Read: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్!
ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుకు ఎవరూ ఊహించని పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. అందరూ అనుకున్నట్లుగానే మొదటిగా టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ పదవిని బీఆర్ నాయుడికి అప్పగించారు. ఆ తర్వాత ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని ప్రచారం నడిచింది.
అదే పనిమీదే పవన్ ఢిల్లీలో పర్యటించారని.. అక్కడ బీజేపీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అనుకున్నదంతా తలకిందులైంది. మూడు రాజ్యసభ స్థానాలు ఉండగా.. అందులో టీడీపీకి రెండు, బీజేపీకి ఒకటి చొప్పున వెళ్లాయి. దీంతో రాజ్యసభ అవకాశం కూడా పోయింది.
Also Read: తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు!
అయితే ఈసారి మాత్రం పవన్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాగబాబును ఎమ్మెల్సీ చేసి ఏపీ మంత్రి వర్గంలోకి తీసుకోకున్నట్లు సమాచారం. త్వరలోనే నాగబాబు జనసేన నుంచి మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిసింది.
Also Read: భారతీయులకు అలర్ట్...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్!
ఇదిలా ఉంటే ఇప్పటికే చంద్రబాబు కేబినెట్‌లో జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ ఒకరు.. కాగా మరో ఇద్దరు నాదేండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉన్నారు. ఇక త్వరలో నాగబాబు కేబినెట్‌లో చేరితో జనసేన నుంచి మంత్రుల సంఖ్య నలుగురికి చేరుతుంది.