/rtv/media/media_files/2025/03/25/IVTiMgCcw3tHVcC2cJvV.jpg)
Komatireddy Rajagopal reddy
Komatireddy: తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. క్యాబినెట్‌లో ఆరు ఖాళీలు ఉండగా మూడింటిని భర్తీ చేశారు. అయితే మంత్రి వర్గంలో తమకు చోటు లభిస్తుందని పలువురు ఎమ్మెల్యేలు భావించారు. కానీ చాలామందికి మొండిచేయే మిగిలింది. అయితే మంత్రి పదవి దక్కని నాయకులు చాలామంది అలిగితే వారిని అధిష్టానం బుజ్జగింపులు మొదలు పెట్టింది. ఇదిలా ఉండగా మొదటి నుంచి మంత్రి పదవికోసం ప్రయత్నం చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా పదవీ దక్కలేదు. ఇప్పటికే ఆయన సోదరుడు మంత్రిక ఉండటంతో ఆయనకు స్థానం దక్కలేదని తెలుస్తోంది. ఇక్కడి వరకు భాగనే ఉన్నా. తాజాగా ఆయన అనుచరులు మాత్రం తమ ఎమ్మెల్యేకు మంత్రిపదవి ఇవ్వాలని పట్టుపడుతున్నారు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని వార్నింగ్ కూడా ఇస్తున్నారు.
తెలంగాణ కేబినెట్‌లో నూతనంగా నియమితులైన మంత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కోరుకుంటున్నాను.
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) June 11, 2025
నాకు రాజకీయాలు అంటే పదవులు గానీ, అధికారాలు గానీ కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే…
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ ఇద్దరు యవకులు హల్‌చల్ చేశారు. వాటర్ ఎక్కి తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వకుంటే వాటర్ ట్యాంక్ పై నుంచి దూకేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే చండూరులో ఇద్దరు యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుంటే.. తాము వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. యువకుల వీరంగం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా తనకు మంత్రి పదవి రాకపోవడంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. కొత్తగా మంత్రి పదవులు పొందిన ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా..తెలంగాణ కేబినెట్‌లో నూతనంగా నియమితులైన మంత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కోరుకుంటున్నాను. నాకు రాజకీయాలు అంటే పదవులు గానీ, అధికారాలు గానీ కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే కారణంగా నేనే తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను.
ఈ రోజు నేను మంత్రిగా లేక పోయినా, పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాను. ప్రజల సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో నేను ఎప్పటికీ ముందుంటాను. నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు. కొన్నిసార్లు, పదవి లేకుండానే ప్రజల మధ్య పని చేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుంది. అదే మార్గాన్ని నేను ఎంచుకున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: మునగ నీటితో అద్భుత లాభాలు.. డయాబెటిక్ రోగులకు బెస్ట్ కషాయం..!!
Follow Us