చంద్రబాబుపై ముద్రగడ లేఖాస్త్రం | Mudragada Padmanabha Reddy | Letter To CM | Chandrababu | RTV
ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారినా.. ముద్రగడ ముద్రగడేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో మాజీ మంత్రి అంబటి సమావేశం అయ్యారు.
జనసేనాని పవన్ కళ్యాణ్‌ని ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఓడిస్తానని కాపు ఉద్యమ, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆయన పేరు మార్చుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తెరచాటు రాజకీయం చేస్తున్నాడని వైసీపీ నేత ముద్రగడ విమర్శలు గుప్పించారు. కాపులు ఒకపక్క రాజాధికారం కోసం పోరాడుతుంటే.. వారిని పక్క పార్టీకి తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. పవన్ రాజకీయాలకు పనికిరాడని సినిమాలు చేసుకోవాలని సూచించారు.
కాపునేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు ఈ నెల 14న ముహుర్తం ఖరారు అయిన విషయం తెలిసిందే. 14 తారీఖున వైసీపీలో చేరేందుకు యావత్తు ప్రజానీకం కూడా తనతో కలిసి రావాలని.. మీ ఆశీస్సులు ఎప్పుడూ తన మీద ఉంచాలని ఆయన కోరారు.
ముద్రగడతో వైసీపీ నేతల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వైసీపీ నేతలు వెళ్తున్నారు. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించనున్నారు. ఇక పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తుండగా.. జనసేనానిపై పోటికి ముద్రగడను దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.
ఏపీలో ముద్రగడ పోల్టికల్ రీఎంట్రీకి అన్ని పార్టీలు డోర్స్ క్లోజ్ చేసినట్లేనని అర్థమవుతోంది. మొదట వైసీపీలో చేరుతున్నారని వార్తలు వినిపించాయి. ఆ తరువాత జనసేనలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, జనసేన మాత్రం ముద్రగడను పట్టించుకోనట్లు తెలుస్తోంది.
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను జనసేన నాయకులు కలిశారు. ఈ నెల 20 లేదా 23వ తేదీ లోపు పవన్ కల్యాణ్ ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయన్ని స్వయంగా పార్టీలోకి ఆహ్వానిస్తారని జనసేన ఇంఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ లేదా జనసేనలోకి వెళ్తానని.. లేకపోతే ఇంట్లోనే కూర్చుంటానని తెలిపారు. మా ఇంటికి వచ్చి సమయం వృథా చేసుకోవద్దని వైసీపీ నేతలకు క్లారిటీ ఇచ్చారు.