/rtv/media/media_files/2025/02/02/cRiHXWA4A69gsIDgVwk5.jpg)
Mudragada House
Mudragada House : వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై ఓ యువకుడు దాడి చేశాడు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసం దగ్గర ఇవాళ ఉదయం ట్రాక్టర్ తో హడావుడి చేశాడు. తెల్లవారుజామున 3 గంటలకు ట్రాక్టర్ తో బీభత్సం సృష్టించి పార్కింగ్ చేసిన కారును ధ్వంసం చేశాడు. అనంతరం జై జనసేన అంటూ నినాదాలు చేశాడని స్థానికులు వెల్లడించారు.సదరు యువకుడు ఆదివారం ఉదయం ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. అనంతరం అక్కడ బీభత్సం సృష్టించాడు. ఇంటి ముందు ర్యాంప్‌పై పార్క్ చేసిన కారును ట్రాక్టర్‌తో ఢీ కొట్టడంతో కారు ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా దాడిచేసిన యువకున్ని జనసేన కార్యకర్త గనిశెట్టి గంగాధర్‌గా గుర్తించారు.రూ.50వేలు ఇస్తానంటేనే దాడి చేశానని గంగాధర్ చెప్పినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: HYD: 2022 నుంచి పరారీలో ఉన్నాడు..హైదరాబాద్ కాల్పుల నిందితుడు పాత దొంగే..
గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే గన్నిశెట్టి గంగాధర్ యువకుడు మద్యం సేవించి ఉన్నట్లు తెలిసింది. మద్యం మత్తులోనే ముద్రగడ కాంపౌండ్‌లో పార్కింగ్ చేసిన కారుతో పాటు ప్లేక్సీలు ధ్యంసం చేశాడు. కాగా గంగాధర్ మద్యం మత్తులో ఇలా చేశాడా? లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.సమాచారం తెలుసుకున్న ముద్రగడ అనుచరులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపై వరుసగా కేసులు పెట్టడంతో పాటు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి.
Also Read: USA: అమెరికాలో విద్యార్థుల విలవిల..క్యాంపస్ లో మాత్రమే ఉద్యోగాలతో ఇబ్బందులు
ముద్రగడ పద్మనాభం గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కీలక నేతగా ఉన్నారు.. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2014-2019 ఎన్నికల్లో కాపు ఉద్యమ నేతగా కీలక బాధ్యతలు నిర్వహించారు.. అయితే 2024 ఎన్నికల సమయంలో ముద్రగడ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావించారు. అయితే జనసేన పార్టీలోకి వెళతారని ప్రచారం జరిగింది. జనసేన నుంచి ఆహ్వానం రాకపోవడంతో వైఎస్సార్‌సీపీలో చేరారు. అయితే అనుహ్యంగా వైసీపీ ఓటమి పాలు కావడంతో ఆయన కొంత సైలెంట్ గానే ఉన్నారు. కానీ ముద్రగడ కూతురు క్రాంతి జనసేనలో చేరగా, కుమారుడు గిరి వైసీపీలో కొనసాగుతున్నారు. ముద్రగడ గిరికి ఇటీవలె కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు.
Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!