గేమ్ ఛేంజర్ గా తెలంగాణ..| Minister Komatireddy Venkata Reddy On RRR Road | CM Revanth Reddy | RTV
TG: బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు మంత్రి కోమటిరెడ్డి. లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్ భూస్థాపితమవుతుందని అన్నారు. రాష్ట్ర సంపదనంతా దోచుకున్నది చాలక కేసీఆర్ కుటుంబం ఢిల్లీకి వెళ్లిందని చురకలు అంటించారు.
TG: లోక్ సభ ఎన్నికల వేళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 5న బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అన్నారు. అలాగే ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీలు తనతో టచ్లోకి వచ్చారని బాంబ్ పేల్చారు.
TS: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. ఒకవేళ అలా చేస్తే బీఆర్ఎస్ పార్టీని పునాదులతో సహా లేపేస్తాం అని హెచ్చరించారు. మూడు నెలల్లో బీఆర్ఎస్లో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు.
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి అన్యాయాలపై విచారణ చేపట్టి వారిని జైలు పంపడం ఖాయమని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలుస్తుందని అన్నారు.
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ఆర్టీవీతో మాట్లాడిన ఆయన.. వచ్చే నెల నుంచి ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హమీ అమలు చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే పథకాలు అమలు చేయడానికి లెట్ అవుతుందన్నారు.
ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యనిషేదంలో అక్రమంగా మందు అమ్మి జైలుకు పోయిన జగదీశ్ రెడ్డి నాపై విమర్శలు చేయడం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ జగదీశ్ రెడ్డిని ఎండగట్టారు.