/rtv/media/media_files/2025/09/26/komatireddy-2025-09-26-07-14-22.jpg)
ఇటీవల IAS మహిళా అధికారుల పట్ల సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకర ప్రచారాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నన్ను మానసికంగా చంపుతున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘నన్ను చంపాలంటే ఇంత విషం ఇచ్చి చంపండి.. నాకు జీవితం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు’ అని అన్నారు.
నన్ను ఇంకా ఇబ్బంది పెట్టాలి అనుకుంటే ఇంత విషం ఇచ్చి చంపండి - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి pic.twitter.com/MDNGemOVYz
— Telugu Scribe (@TeluguScribe) January 10, 2026
"మహిళా అధికారులపై చెప్పలేని భాషలో వార్తలు రాయడం హేయమైన చర్య. మీడియా సోదరులకు కూడా ఇంట్లో అక్కాచెల్లెళ్లు ఉంటారు, మీ కుటుంబ సభ్యులపై ఇలాంటి వార్తలు వస్తే ఎలా ఉంటుంది?" అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా కలెక్టర్ హరిచందన వంటి సీనియర్ అధికారులను మానసిక వేదనకు గురిచేయడం సరికాదన్నారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. "నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చచ్చిపోయాను. దేవుడిని నమ్ముకుని ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తున్నాను. నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టకండి" అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా అధికారుల వ్యవహారంపై DGPతో మాట్లాడి ఎంక్వైరీ వేయమన్నానని, 20 రోజుల్లో నిజానిజాలు బయటకు వస్తాయని, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ల బదిలీలు ముఖ్యమంత్రి నిర్ణయమని, దానికి మంత్రితో సంబంధం పెట్టొదని ఆయన కోరారు.
నల్గొండ మంత్రికి, మహిళా అధికారికి మధ్య సంబంధాలు అంటూ సోషల్ మీడియాలో వార్తలు, ఒకటి రెండు టీవీ ఛానల్లలో వార్తలు వచ్చాయి.. వీటిని నేను ఖండిస్తున్నాను
— Telugu Scribe (@TeluguScribe) January 10, 2026
నేను మంత్రి అయ్యాక నల్గొండలో నలుగురు కలెక్టర్లు మారారు.. వీరిని ముఖ్యమంత్రి మార్చాడు, మహిళా అధికారుల బదిలీలు ముఖ్యమంత్రి చేతిలో… https://t.co/hygOeBhRtLpic.twitter.com/zJDFfeQBFx
సంక్రాంతి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గత ఏడాది సంక్రాంతికి సుమారు 9.97 లక్షల వాహనాలు సరిహద్దులు దాటగా, ఈ ఏడాది ఆ సంఖ్య 12 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
టోల్‌గేట్ రద్దీ..
హైదరాబాద్-విజయవాడ మార్గంలో విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు హైదరాబాద్-కర్నూలు వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని మంత్రి సూచించారు. "రద్దీ ఒక పరిమితిని మించి పెరిగితే, వాహనాలను టోల్ ఫీజు వసూలు చేయకుండానే అనుమతించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. అయితే, తెలంగాణకు టోల్ ఫ్రీ పర్మిషన్ ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది, కానీ ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటాం" అని ఆయన స్పష్టం చేశారు.
రహదారుల అభివృద్ధి, హైస్పీడ్ రైలు
వచ్చే ఏడాది నాటికి హైదరాబాద్-విజయవాడ 6 లైన్ల రహదారి పనులను పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే, ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి DPR పిలవడం జరిగిందని వెల్లడించారు.
Follow Us