Komatireddy Venkat Reddy: మా ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనాలని చూస్తున్నారు.. బిగ్ బాంబ్ పేల్చిన మంత్రి కోమటిరెడ్డి

TS: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. ఒకవేళ అలా చేస్తే బీఆర్ఎస్ పార్టీని పునాదులతో సహా లేపేస్తాం అని హెచ్చరించారు. మూడు నెలల్లో బీఆర్ఎస్‌లో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు.

New Update
Komatireddy Venkat Reddy: మా ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనాలని చూస్తున్నారు.. బిగ్ బాంబ్ పేల్చిన మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy Venkat Reddy: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొనాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పిన వారు మారడం లేదని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదని సవాల్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని పునాదులతో సహా లేపేస్తాం అని హెచ్చరించారు. మూడు నెలల్లో బీఆర్ఎస్ లో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు.

ALSO READ: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కేఏ పాల్ ఎన్నికల సాంగ్

అందుకే ఆగింది..

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రైతు బంధు, రుణమాఫీ ఇవ్వలేకపోయాం అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఎన్నికల కోడ్ ముగిశాక ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం అన్నారు. కేసీఆర్‌, జగన్‌ కుట్రల వల్ల కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలను అమలు చేసినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

కేసీఆర్ వల్లే కవిత జైలుకు..

పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నడుమే పోటీ ఉండబోతుందని అన్నారు. 12 నుంచి 13 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కుటుంబ దగా వల్ల కవిత బలైందని వ్యాఖ్యానించారు. కవిత జైల్లో ఉన్నా కేసీఆర్‌కు ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ త్వరలో జైలుకి పోవడం ఖాయమని కుండబద్దలు కొట్టారు మంత్రి కోమటిరెడ్డి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు