బీజాపూర్‌లో భారీ ఎన్కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి
చత్తీస్ఘడ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య శనివారం కాల్పులు జరిగాయి. గంగులూరు పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పశ్చిమ బస్తర్‌లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఎదురుకాల్పుల్లో 8మంది మావోలు మృతి చెందారు.
Maoist: 16 మంది 40 గంటల పోరాటం.. ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ!
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఏఓబీ ఉద్యమంతో అమరుడు చలపతికి 32 ఏళ్ల అనుబంధం ఉందంటూ నివాళి అర్పించింది. ఈ ఎన్కౌంటర్లో 16 మంది 40 గంటల పాటు పోరాడి ప్రాణాలొదిరారని, వారి ఆశయ సాధనకు మనమంతా పునరంకితమవుదామని పిలుపునిచ్చింది.
Maoist Letter on Encounter: వారంతా సేఫ్.. కాంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!
ఛత్తీస్‌గఢ్ కాంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ దామోదర్ మరణించలేదని తెలిపింది. 8వేల మంది పోలీసుల ఏకపక్ష దాడిలో 4గురు గ్రామస్థులు చనిపోయినట్లు సమత ప్రవక్త పేరుతో రిలీజ్ చేసిన లేఖలో స్పష్టం చేసింది.
Maoist: ఈ నేలపై నక్సలిజం చావదు.. ప్రభుత్వాలవి నీటిపై రాతలే: RTVతో పౌరహక్కుల నేత!
మావోయిజం అంతం చేయాలనుకోవడం నీటిపై రాతలేనని పౌరహక్కుల నేత చిలక చంద్రశేఖర్ అన్నారు. చలపతి, చంద్రహాస్‌ను చంపినంత మాత్రానా ఈ నేలపై నక్సలిజం చావదన్నారు. తలలకు వెలకట్టి, తూట్లు పోడవడం అమానవీయ చర్యగా పేర్కొన్నారు.
Encounter: మావోయిస్టుల ఎన్కౌంటర్లో 27కు పెరిగిన మృతుల సంఖ్య
ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 27కు చేరింది. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. కోబ్రా, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ బలగాలు గరియాబంద్ ప్రాంతంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌లో 27 మంది మవోయిస్టులను హతమార్చారు.
Encounter: ఛత్తీస్‌ఘడ్ ఎన్కౌంటర్లో నల్గొండ వాసి మృతి.. ఆ గ్రామంలో విషాద ఛాయలు!
ఛత్తీస్‌ఘడ్ గరియాబాద్ భారీ ఎన్ కౌంటర్లో నల్గొండ జిల్లా వాసి మృతిచెందాడు. చండూరు మండలం పుల్లెంలకు చెందని పాక హన్మంతు కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. 45ఏళ్ల క్రితం హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లగా ఆయన మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Maoist Encounter: ఛత్తీస్‌గడ్‌లో ఎన్కౌంటర్లో రూ.కోటి రివార్డు ఉన్న మావోయిస్ట్ హతం!
ఛత్తీస్గడ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. సెంట్రల్ కమిటీ సభ్యుడు మనోజ్, మావోయిస్ట్ పార్టీ ఇంఛార్జ్ జయరాం అలియాస్ చలపతి పాటు మరో కీలక అగ్రనేత వీరిలో ఉన్నారని సమాచారం. చలపతిపై రూ. కోటి రివార్డు ఉంది. చలపతి స్వస్థలం చిత్తూరు జిల్లా.