Mammootty: స్టార్ హీరో మమ్ముట్టి కుటుంబంలో పెను విషాదం!
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన మామ పి.ఎస్. అబు 90 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. పి.ఎస్. అబు కి మమ్ముట్టి భార్య సుల్ఫత్ కుట్టితో సహా నలుగురు పిల్లలు ఉన్నారు.