/rtv/media/media_files/2025/04/14/ylviNfovrNeAJouO07ey.jpg)
Prabhas Spirit
Prabhas Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
దర్శకుడు సందీప్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ కథపై స్పందిస్తూ, ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై ఎన్నో కాప్ స్టోరీలు వచ్చినా, ‘స్పిరిట్’లో చూపించే పోలీస్ క్యారెక్టర్ మాత్రం పూర్తిగా విభిన్నంగా ఉంటుంది అని వెల్లడించారు. “ఇదో కొత్త కోణం... ఇది పూర్తిగా కథకుడిగా నేను బలంగా చెప్పే ఓ స్పెషల్ స్టోరీ,” అని ఆయన తెలపడం గమనార్హం.
Also Read: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!
ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా..
ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్‌తో పాటల చర్చలు పూర్తయినట్లు సమాచారం. స్క్రిప్ట్ పని పూర్తయి, నటీనటుల ఎంపికలో సందీప్ బిజీగా ఉన్నారు.
Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..
మమ్ముట్టి(Mammootty) కీలక పాత్రలో..
ఇది ఓ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ కావడంతో కొరియన్, అమెరికన్ నటులను కూడా ఈ సినిమాలో భాగంగా చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు మరో హైలైట్ ఏమిటంటే... మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇందులో ఓ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారు. ఆయన పాత్ర ప్రేక్షకులపై బలమైన ప్రభావం చూపేలా ఉండబోతోందట.
ఆగెస్ట్ లో షూటింగ్ ప్రారంభం..
సినిమా షూటింగ్‌ను 2025 ద్వితీయార్ధంలో మొదలుపెట్టే ప్లాన్‌లో ఉన్నారు. ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో మొదటి నుంచే భారీ అంచనాలు ఉండగా, తాజా అప్‌డేట్స్ స్పిరిట్ పై క్రేజ్‌ను మరింత పెంచేశాయి.
ఈ చిత్రాన్ని టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హై టెక్నికల్ వ్యాల్యూస్, ఇంటెన్స్ స్టోరీ, గ్లోబల్ క్యాస్టింగ్‌తో ‘స్పిరిట్’ సినిమా ఇండియన్ సినిమాకే కొత్త మలుపు కావొచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read: గ్రాఫిక్స్ గాలికి వదిలేశారా..? విశ్వంభరపై 'బన్ని' ప్రొడ్యూసర్ హాట్ కామెంట్స్