Maharashtra : మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూత
గుండెపోటుతో మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నూమూశారు. రెండు రోజుల క్రితం హార్ట్ ఎటాక్‌తో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆయన ఈరోజు తెల్లవారు ఝామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు.
గుండెపోటుతో మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నూమూశారు. రెండు రోజుల క్రితం హార్ట్ ఎటాక్‌తో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆయన ఈరోజు తెల్లవారు ఝామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు.
మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కమలం గూట్లో చేరనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముంబైలోని బీజేపీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, చంద్రకాంత్ బవాన్ కులే సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు.
మహారాష్ట్రలో శరద్ పవార్ వర్గానికి పార్టీ పేరును కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరత్ చంద్ర పవార్ పేరును ఖరారు చేసింది. త్వరలో 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కొత్త పేరు, గుర్తు ఎంచుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
పూణె జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయంలో ఈవీఎం పరికరాలు చోరీకి గురయ్యాయి. రెవెన్యూ అధికారి కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) పరికరం, కొన్ని స్టేషనరీలను దొంగిలించారు.
తనకు తన కుమారుడికి ప్రాణ హానీ ఉందన్న భయంతోనే శివసేన నేత మహేష్ గైక్వాడ్ పై కాల్పులు జరిపినట్లు బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్ తెలిపారు. కేవలం తన కుమారుడ్ని రక్షించుకోవడంతో పాటు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు ఎమ్మెల్యే వివరించారు.
మహారాష్ట్రలో 33 వేల మట్టి దీపాలతో ''సియావర్ రామచంద్ర కీ జై'' అనేలా రాసి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఇలా చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
దేశంలోనే అతి పొడవైన అటల్ సేతును ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ వంతెన 21 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంది. ఈ బ్రిడ్జిని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని పిలుస్తున్నారు. 21.8కి.మీ మేర ఈ బ్రిడ్జిని నిర్మించారు. రూ. 17,840కోట్లు ఖర్చు చేశారు.
చరణ్ ఉపాసన దంపతులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారి అతిథ్యం ఎంతో బాగుందని ఉపాసన కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బజార్ గాన్ లోని ఒక సోలార్ కంపెనీలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించడంతో 9 మంది మృతి చెందారు. క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్ ప్యాక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.