ISIS Terror Conspiracy Case: కర్నాటక, మహారాష్ట్రలో NIA ఏకకాలంలో దాడులు..13 మంది అరెస్ట్..!!
కర్నాటక, మహారాష్ట్రలో ఎన్ఐఏ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. 13మందిని అరెస్టు చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో 40కిపైగా ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.
కర్నాటక, మహారాష్ట్రలో ఎన్ఐఏ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. 13మందిని అరెస్టు చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో 40కిపైగా ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.
మహారాష్ట్రలో మైనర్ బాలుడి పై ఇద్దరు నిందితులు తమ పైశాచికత్వం ప్రదర్శించారు. అప్పుగా తీసుకున్న 300 రూపాయలను తిరిగి ఇవ్వమంటే బాలుడు ఇవ్వను అనడంతో అతడ్ని నగ్నంగా మార్చి బెల్టుతో చితకబాదారు. వారి వద్ద నుంచి తప్పించుకున్న బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వంతెన పై అదుపుతప్పిన ఓ కారు రెయిలింగ్ ను ఢీకొట్టి కింద పట్టాలపై వెళ్తున్న గూడ్స్ రైలు మీద పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యారు.ఈ ప్రమాదం మహారాష్ట్రలోని రాయ్గడ్ లో జరిగింది.
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 50కు పైగా స్థానాలు గెలుచుకుంది. వచ్చే ఏడాది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్, NCP ఓట్లు చీల్చే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.
మహారాష్ట్ర నాగపూర్ జిల్లాలో తేజ్ రామ్ అనే వైద్యుడు తనకు టీ ఇవ్వలేదనే కోపంతో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో అతని మీద ఉన్నతాధికారులు విచారణ కమిటీ ఏర్పాటు చేశారు.
మహారాష్ట్రలో 130 సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా..అందులో ఏకంగా 57 పదవులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
మహారాష్ట్రలో మరాఠా ఉద్యమం కోసం గత కొన్ని రోజులుగా ఉద్యమం జరుగుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసు అధికారులు 144 సెక్షన్ ను అమలు చేయడంతో పాటు..ఇంటర్నెట్ సేవలను కూడా బంద్ చేశారు.
కోటీన్నర గెలిచి సంబరాల్లో మునిగిపోతున్న సోమనాథ్కు డిపార్ట్మెంట్ షాక్ ఇచ్చింది. బెట్టింగ్ యాప్ ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఆటల వల్ల కొంతమంది ప్రాణాలు పోతుంటే.. మరి కొంతమంది కోటీశ్వరులు అవుతున్నారు.
పూణె-ముంబై రైలు మార్గంలో పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై వేరు వేరు చోట్ల పెద్ద బండరాళ్లు పెట్టారు దుండగులు. రైలు వస్తున్నప్పుడు రాళ్లు కిందపడిపోకుండా సపోర్టుగా మరికొన్ని రాళ్లు పేర్చారు. అయితే, వీటిని గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే రాళ్లను తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో రైలు ప్రయాణికులందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ మధ్య కాలంలో వరుస రైలు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే, ఇది కేవలం సంఘవిద్రోహుల పనే అంటున్నారు రైల్వే అధికారులు.