బావను పలకరించేందుకు వెళ్లిన బావమరిదిని | Madugula | RTV
బావను పలకరించేందుకు వెళ్లిన బావమరిదిని | Madugula Mandal becomes the center for a surprising murder by a person kills him with Axe in Mahboob Nagar District| RTV
బావను పలకరించేందుకు వెళ్లిన బావమరిదిని | Madugula Mandal becomes the center for a surprising murder by a person kills him with Axe in Mahboob Nagar District| RTV
వనపర్తి జిల్లాలోని కొత్తపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. హై స్పీడ్ కారణంగా అదుపుతప్పిన కారు పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది.భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. మహబూబాబాద్ సమీపంలోని అమోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది.దీంతో విజయవాడ – కాజీపేట మార్గంలో ట్రాక్ ను ఆనుకొని వరద నీరు ప్రవహించడంతో ట్రాక్ కింద రాళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి.
మహబూబ్‌నగర్ జిల్లా కిష్టారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అత్తమామల ఆస్తి పంపకాల్లో వాటాకు ఒప్పుకోవడం లేదని భార్యను భర్త గొంతు నులిమి హత్య చేశాడు. డెడ్‌బాడీని డంపింగ్ యార్డులో పడేసి మిస్సయిందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కూతురు ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
నేషనల్ హైవే పై 44 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఓ బస్సు పూర్తిగా దగ్ధమైంది.జడ్చర్ల బురెడ్డిపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి 1:45 గంటల ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
రూ. 396.09 కోట్లతో మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. మహిళా శక్తి క్యాంటీన్, మున్సిపాలిటీ, పాలమూరు యూనివర్సిటీ, బాలికల హాస్టల్ తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు.
చిన్నపొర్ల భూ వివాదం కేసుపై ఎస్పీ యేగేష్ గౌతమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్సై బి.శ్రీనివాసులను సస్పెండ్ చేశామని చెప్పారు. నిందితులందరినీ పట్టుకుంటామన్నారు.