EC: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా!
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కు సంబంధించిన కౌంటింగ్ ను జూన్ 2 కు వాయిదా వేశారు. ఎంపీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కౌంటింగ్ ను వాయిదా వేయాలని కలెక్టర్ కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కు సంబంధించిన కౌంటింగ్ ను జూన్ 2 కు వాయిదా వేశారు. ఎంపీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కౌంటింగ్ ను వాయిదా వేయాలని కలెక్టర్ కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఎంపీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెల్ లో చేరారు. త్వరలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్న వేళ ఈ చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది.
మహబూబ్ నగర్ జిల్లా తాటికొండ గ్రామ శివార్లలో జంతు కళేబరాలతో నూనెను తయారు చేసే కంపెనీ బాగోతాన్ని RTV బయటపెట్టింది. ఈ కంపెనీ నుంచి వచ్చే దుర్వాసనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ కంపెనీపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కోటీశ్వరులే. ఇది మేం చెబుతున్నది కాదు.. అభ్యర్థుల అఫిడవిట్లే చెబుతున్నాయి. పోటీ చేస్తున్న నేతంలదరికీ కోట్లలోనే ఆస్తులు ఉన్నాయి. ఎవరి ఆస్తులు ఎంత, ఎవరి అప్పులు ఎంత తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి.
మహబూబ్ నగర్ జిల్లా సీసీఎస్ సీఐ ఇఫ్తేకార్ హమ్మద్ పై కానిస్టేబుల్ జగదీష్ దాడికి పాల్పడ్డాడు. జగదీష్ తన భార్య శకుంతలతో సీఐ కి ఉన్న అక్రమ సంబంధం గురించి తెలిసింది.సీఐ పై కత్తితో దాడి చేసి. సీఐ మర్మాంగాలు కోసేసి తీవ్రంగా గాయపరిచాడు.
హైదరాబాద్ చంపాపేటలో దారుణం జరిగింది. పెళ్లైన నెల రోజులకే భార్యను అతి కిరాతకంగా చంపాడు ఓ భర్త. స్వప్నను కత్తితో దారుణంగా హత్యచేశాడు. భార్యను చంపిన ఆనంతరం తాను బిల్డింగ్ పై నుంచి దూకాడు. ఈ సంఘటనతో చంపాపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రస్తుతం భర్త ప్రేమ్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పాలమూరు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. తెలంగాణ మార్పు కోరుకుంటోందని, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యం అని విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. తమకు అవినీతి సర్కార్ కాదు.. పారదర్శక ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందన్నారు.
మహబూబ్‌నగర్‌లో జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. PRLI సందర్శించడానికి వెళ్తున్నాం.. ధర్నాకు.. రాస్తారోకోకు పోతలేమని జూపల్లి కృష్ణారావు అన్నారు. PRLI పూర్తి చేసినమని సీఎం కేసీఆర్.. మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఇది అవాస్తవం.. అది పూర్తి కాలేదు.. వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఇది బయట పడుతుందని భయపడుతుందని ఆయన అన్నారు.
ఆర్మీలో చేరాలంటే అందరూ భయపడే రోజుల్లో.. ఆ గ్రామం నుంచి మాత్రం మేమున్నామంటూ దేశసేవ కోసం క్యూ కట్టారు. సాఫ్ట్వేర్ లాంటి ఉద్యోగాల వైపునకు పరుగులు తీస్తున్న నేటి సమాజంలోనూ ఆ గ్రామంలోని యువత దృష్టంతా ఆర్మీ, నేవి లాంటి ఉద్యోగాల పైనే ఉంది. ఇంతకీ ఏది ఆ గ్రామం.. ఎక్కడుంది..?