Raksha Bandhan 2024: అయ్యో.. తమ్ముడికి రాఖీ కట్టి ప్రాణం విడిచిన అక్క!
రాఖీ పౌర్ణమి వేళ మహబూబాబాద్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆకతాయిల వేధింపులతో పురుగుల మందు తాగిన ఓ అక్క ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా తమ్ముడికి రాఖీ కట్టింది. అనంతరం గంటల వ్యవధిలోనే కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా అందరికీ కన్నీరు పెట్టిస్తోంది.