Telangana Game Changer : మహబూబాబాద్‌లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే! ఈ లోక్ సభ ఎన్నికల్లో మహబూబాబాద్‌లో కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By srinivas 01 May 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Lok Sabha Elections 2024 : మహబూబాబాద్(Mahabubabad).. 2009లో ఏర్పాటైంది ఈ లోక్‌సభ సీటు. గిరిజనులు, ఆదివాసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం వరంగల్‌కు పొరుగునే వుంది. అటవీ ప్రాంతం అధికంగా వుండే మహబూబాబాద్‌లో స్థానిక సమస్యలే గెలుపోటములను తేలుస్తాయి. అడవి బిడ్డల బాగోగులు చూసుకునే వారికే ఇక్కడి ఓటర్లు పెద్ద పీట వేస్తూ వస్తున్నారు. ఎస్‌టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం ఇది. 2019లో బీఆర్ఎస్ అభ్యర్ధి మాలోత్ కవిత గెలిచారు. కాంగ్రెస్(Congress) అభ్యర్ధి బలరాం నాయక్ రెండో స్థానానికి పరిమితం అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ బలరాం నాయక్ - మాజీ ఎంపీ, కేంద్రమంత్రిగా చేశారు. బీఆర్ఎస్ మాలోత్ కవిత - సిట్టింగ్ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే. బీజేపీ అజ్మీరా సీతారాం నాయక్ - తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉంది. 2014 నుంచి 2019 వరకూ మహబూబాబాద్ ఎంపీగా చేశారు. కాంగ్రెస్ కు గెలిచే అవకాశం రీజన్స్‌ః 1) గతంలో ఇక్కడ్నించి ప్రాతినిధ్యం వహించడం, కేంద్రంలో మంత్రిగా చేయడంతో బలరాం నాయక్(Balaram Naik) ప్రభావం గట్టిగా కనిపిస్తోంది. 2) మంత్రి సీతక్క ప్రభావం 6 నియోజకవర్గాలపై వుండడం సానుకూలమైన అంశం. 3) ఈ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. 4) బీఆర్ఎస్ వీక్ అవడం.. బీజేపీ విజయం సాధించే స్థాయికి విస్తరించకపోవడం.. ప్రధానంగా కాంగ్రెస్ విజయానికి కారణమవుతోంది. 5) సీతారాం నాయక్‌కు వ్యక్తిగతంగా కరిష్మా వుంది. కొన్ని ఉద్యమ సంస్థలు ఆయన కోసం పనిచేస్తున్నా.. 2014 నాటి ఐక్యత సంఘాల్లో లేదు. #lok-sabha-elections-2024 #mahabubabad #ravi-prakash మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి