Omkareshwar : నేడు ఓంకారేశ్వర్‌లో ఆదిశంకరాచార్యుల విగ్రహావిష్కరణ..!!
జీ-20 విజయవంతంగా నిర్వహించి ప్రపంచానికి 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే సందేశాన్ని అందించిన భారత్ మరోసారి ప్రపంచానికి ఏకతా సందేశాన్ని ఇవ్వనుంది. ఈసారి ఈ సందేశం మధ్యప్రదేశ్‌లోని జ్యోతిర్లింగ ఓంకారేశ్వర్ పుణ్యక్షేత్రం నుండి ఇవ్వనుంది. ప్రపంచానికి ఏకతా సందేశాన్ని అందించిన ఆదిగురువు శంకరాచార్యుల 108 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని గురువారం ఇక్కడ అంగరంగ వైభవంగా ఆవిష్కరించనున్నారు. 12 జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నాల్గవది. నర్మదా నది ఒడ్డున ఓంకారేశ్వరుడు, మమలేశ్వరుడు కొలువై ఉన్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, అన్ని తీర్థయాత్రలు చేసిన తర్వాత, ఓంకారేశ్వర తీర్థానికి చేరుకుని.. నర్మదాలో స్నానం చేసి, ఓంకారేశ్వరుని జలాభిషేకం చేయడం తప్పనిసరి.