PM Modi in MP: సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకే ఇండియా కూటమి ఏర్పడింది..!!
ప్రధాని నరేంద్రమోదీ విపక్షలపై ఫైర్ అయ్యారు. ఎన్నికల రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం భారీబహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకే ఇండియా కూటమి ఏర్పడిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సనాతన సంస్థను ఎవరూ నాశనం చేయలేకపోయారని, ఎవరూ చేయలేరని ఈ దురహంకార కూటమి తెలుసుకోవాలని మోదీ అన్నారు.